ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ తరువాత ఇప్పుడు బిగ్ దీవాళి సేల్ ‌ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారీగా డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఐఫోన్ 13పై ఇస్తున్న భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ నుంచి గత నెలలో ఐఫోన్ 14 లాంచ్ అయింది. అయినా ఇంకా ఐఫోన్ 13 క్రేజ్ కొనసాగుతోంది. ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనుకుంటే..మీకిదే గుడ్‌న్యూస్. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సేల్ అక్టోబర్ 16 వరకు మాత్రమే ఉంటుంది. అందుకే ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఇంతకంటే మరో అవకాశం లభించదు.


ఐఫోన్ 13 లో 128 జీబీ స్టోరేజ్ గ్రీన్ కలర్ వేరియంట్‌పై అద్భుతమైన ఆఫర్ ఉంది. ఐఫోన్ 14 లాంచ్ అనంతరం ఐఫోన్ 13 మార్కెట్‌లో 69,900 రూపాయలకు విక్రయమౌతోంది. ఇప్పుడు దీవాళి సేల్‌లో భాగంగా 14 శాతం డిస్కౌంట్ అనంతరం 59,900 రూపాయలైంది. 


ఇది కాకుండా ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆపర్లతో ఐఫోన్ 13 మరింత చౌకగా మారుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 2250 రూపాయలు తగ్గింపు ఉంటుంది. దాంతో ఐఫోన్ 13 ధర 57,740 రూపాయలైంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఇస్తే 16,900 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ధర మీకు పూర్తిగా వర్తిస్తే..ఐఫోన్ 13 ధర కేవలం 40,840 రూపాయలు మాత్రమే. 


ఐఫోన్ 13 ఫీచర్లు


ఐఫోన్ 13 అనేది 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 50 సేవల్ని సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 13 స్క్రీన్ 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో రెండు సెన్సార్ కెమేరాలు 12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమేరా కూడా 12 మెగాపిక్సెల్ కావడం విశేషం. 


Also read: Today Gold rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook