వివిధ ఈ కామర్స్ వేదికల్లో వివిధ రకాల ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు ఆఫర్లు ఉంటుంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకునే చాలా తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు వంటివి సొంతం చేసుకోవచ్చు. యాపిల్ లాంటి ఖరీదైన వస్తువులపై ఇదే ఆఫర్ ఉంటే ఇంక అంతకంటే ఏముంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇప్పటికే ముగిసింది. అయినా ఇంకా కొన్ని రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో మోడల్‌పై కూడా అదే ఆఫర్ ఇంకా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోను కేవలం 1150 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 26,900 ధర కలిగిన ఈ ఎయిర్‌పాడ్స్ అంత తక్కువకు ఎలా లభిస్తుందని ఆశ్చర్యపోతున్నారా..


యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో మోడల్ ధర 26,900 రూపాయలు. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఇదే ధర ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ అనంతరం 21,400 రూపాయలు లభిస్తున్నట్టుగా ఉంది. మరి 1150 రూపాయలు ఎలా అని ఆలోచిస్తున్నారా..ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 10 శాతం డిస్కౌంట్ అందుతుంది. ఆ తరువాత ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి పరిశీలించాల్సి ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకారం మీ పాత స్మార్ట్‌ఫోన్లపై 19 వేల రూపాయల వరకూ ఆఫర్ ఉంది. అంటే ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే..యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో కేవలం 1150 రూపాయలే లభిస్తుంది. 


రియల్‌మి టెక్ లైఫ్ బడ్స్‌పై కూడా 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ అనంతరం రియల్‌మి బడ్స్ కేవలం 1499 రూపాయలకు లభించనుంది. 


Also read; India post Recruitment: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాల భర్తీ, ఇవాళే ఆఖరు తేదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook