iPhone 14 Price Drop: ఆపిల్ తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఐఫోన్ 15 లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అప్పుడే ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిపోయింది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ఊహించని డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం కాగలదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్ కంపెనీ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఐఫోన్‌ను ప్రస్టేజ్ సింబల్‌గా భావిస్తారు. ధర ఎక్కువైనా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా ఆపిల్ కంపెనీ కొత్త సిరీస్ లాంచ్ కాగానే మార్కెట్‌లో ఉన్న పాత సిరీస్ ధరపై డిస్కౌంట్ ప్రకటిస్తుంటుంది. కానీ ఈసారి కొత్త సిరీస్ లాంచ్ కాకుండానే పాత మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 సెప్టెంబర్ నెలలో లాంచ్ కావచ్చు. ఈలోగా ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిపోయింది. వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్ల అనంతరం ఐఫోన్ 14 ఎంతకు లభిస్తుందో పరిశీలిస్తే ఆశ్చర్యపోతారు. 


ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 స్టార్‌లైట్ రంగులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 79,900 రూపాయలుంది. ధర ఎక్కువ కావడంతో చాలామంది బడ్జెట్ సహకరించక వెనుకంజ వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ధరపై 15 శాతం డిస్కౌంట్ అందుతోంది. డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 14 ధర కేవలం 58,999 రూపాయలుగా ఉంది. ఈ ధర కూడా ఎక్కువే అన్పిస్తే మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే మరింత తక్కువకు ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు.


ఐఫోన్ 14 మోడల్ కావాలంటే 15 శాతం డిస్కౌంట్ అనంతరం 58,999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్‌పై ఏకంగా 33 వేల రూపాయలు డిస్కౌంట్ లభించనుంది. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ కిందకు వస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే లభించే డిస్కౌంట్ ఇది. అయితే ఈ ఎక్స్చేంజ్ ఎంత వర్తిస్తుందనేది పూర్తిగా మీరు ఎక్చ్చేంజ్ చేసే ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే మాత్రం 33 వేలు నేరుగా డిస్కౌంట్ లభిస్తుంది. అంటే దాదాపు 80 వేల రూపాయల విలువైన ఐఫోన్ 14 కేవలం 35,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 14 లభించడమంటే సాధారణ విషయం కాదు. మరెన్నడూ లభించని ఆఫర్ ఇది. 


Also read: Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లో భారీ డివిడెండ్ రాబడి ఇచ్చే షేర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook