iPhone 11 buy only Rs 4800 in Flipkart Big Billion Days Sale 2022: ప్రముఖ మొబైల్ సంస్థ 'యాపిల్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. భారత్‌లో కూడా యాపిల్‌ ఐఫోన్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న యాపిల్.. ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లో వదులుతూ తమ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఐఫోన్ 14 మోడల్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఐఫోన్ 11 మోడల్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌' నడుస్తోంది. సెప్టెంబర్‌ 23 నుంచి 30 వరకు ఈ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే యాపిల్ ఐఫోన్ 11 (APPLE iPhone 11, White, 64 GB) మోడల్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 అసలు ధర రూ. 43,900గా ఉంది. 18 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ రూ. 35,990లకు అందుబాటులో ఉంది.


యాపిల్ ఐఫోన్ 11పై బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. అలానే ఐసీఐసీ క్రెడిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. ఐఫోన్ 11పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 31,190 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే ఈ మొత్తం వరిస్తుందన్న విషయం తెలిసిందే. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. ఐఫోన్ 11ను 4,800లకు సొంతం చేసుకోవచ్చు. 


Also Read: IND vs AUS: ఉప్పల్ మ్యాచ్‌పై నీలినీడలు.. మరో చోటుకు షిఫ్ట్ చేసే ఆలోచనలో బీసీసీఐ!
Also Read: బుమ్రా, చహర్ ఇన్.. ఉమేశ్, హర్షల్ ఔట్! ఆస్ట్రేలియాతో తలపడే భారత్ తుది జట్టు ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.