Flipkart OnePlus TV Offers: పిచ్చెక్కిస్తున్న ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ రూ.15,999కే 32 ఇంచెస్ OnePlus Y1 టీవీ
Flipkart Offers on OnePlus Y1S 32 Inch TV. వన్‌ప్లస్ వై1ఎస్ 32 ఇంచ్ టీవీ (OnePlus Y1S 32 inch HD Ready LED Smart Android TV)పై 27 శాతం ఆఫర్ ఉంది.
Rs 25999 OnePlus Y1S 32 inch TV buy only Rs 15999 in Flipkart Big Billion Days Sale 2022: ప్రముఖ మొబైల్ సంస్థ 'వన్‌ప్లస్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో కూడా వన్‌ప్లస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన వన్‌ప్లస్.. స్మార్ట్ టీవీలను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ మాదిరే స్మార్ట్ టీవీలకు కూడా మన మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో చాలా సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వన్‌ప్లస్ వై1ఎస్ టీవీపై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు 'బిగ్ బిలియన్ డేస్ సేల్' ఉంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై భారీగా డిస్కౌంట్లు ఉండబోతులున్నాయి. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే.. కొన్ని బ్రాండెడ్ టీవీలపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ వై1ఎస్ 32 ఇంచ్ టీవీ (OnePlus Y1S 32 inch HD Ready LED Smart Android TV)పై 27 శాతం ఆఫర్ ఉంది. అంటే రూ. 6000 తగ్గింపు ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ వై1 టీవీ 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 21,999గా ఉంది. 27 శాతం తగ్గింపుతో (రూ. 6000) ఈ టీవీ రూ. 15,999లకు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ వై1ఎస్ టీవీపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఆక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 200 ప్రత్యేక ఆఫర్ ఉంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 11000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 4,999లకు వన్‌ప్లస్ వై1ఎస్ టీవీని సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్ టీవీ కండిషన్ బాగుంటేనే రూ. 11000 వర్తిస్తాయన్న విషయం తెలిసిందే. 40, 43 ఇంచెస్ టీవీలపై కూడా భారీ ఆఫర్లు కూడా ఉన్నాయి.
వన్‌ప్లస్ వై1 టీవీ 32 ఇంచ్ స్పెసిఫికేషన్లు:
# 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ
# 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సల్స్
# 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz
Also Read: IND vs AUS: స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు.. రెండో టీ20లో టీమిండియాదే విజయం!
Also Read: IND vs AUS: అతడిపై ఎలాంటి ఒత్తిడి పెట్టబోం..స్టార్ ప్లేయర్‌పై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.