Flipkart Offers: 50MP కెమేరా, 8 జీబి RAM బ్రాండెడ్ ఫోన్‌పై భారీ తగ్గింపు
Flipkart Offers: బ్రాండెడ్ 5జి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కొంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన మోటోరోలా జి54పై.
Flipkart Offers on Mobiles: దేశంలో ఎన్నో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో వీటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తుంటాయి. అదే విధంగా మోటోరోలా జి 54 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జి54 ఫోన్లపై డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ ఎంత, ఎంతకు లభిస్తుంది, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Motorola G54 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ డిస్కౌంట్ అనంతరం చాలా తక్కువ ధరకే లభ్యమౌతోంది. ఈ ఫోన్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇక 1080/2400 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక ప్రోసెసర్ విషయానికొస్తే ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6ఎన్ఎం ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.
Motorola G54 5G స్మార్ట్‌ఫోన్ అనేది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమేరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా మరో ప్రత్యేకత. ఇందులో 8 జీబి ర్యామ్- 128 జీబి స్టోరేజ్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్ కావడంతో ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. అన్నింటికంటే ప్రత్యేక ఆకర్షణ ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. 30 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ కేవలం 13,999 రూపాయలకే పొందవచ్చు. ఇంకా ఇతర బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Also read: Instagram Earning Tips: ఇన్‌స్టా నుంచి డబ్బులు సంపాదించడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి