Instagram Earning Tips: ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ సోషల్ మీడియా ఏదైనా సరే ఫాలోవర్లు పెరిగే కొద్దీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించి వేలకు వేలు సంపాదించుకుంటున్నారు. ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. కొద్దిగా ఓపిక ఉండాలి. ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య పెరగడం అనేది మీరు పోస్ట్ చేసే కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంటెంట్లు ఉన్నట్టుండి వైరల్ అవుతుంటాయి.
ఇన్‌స్టాలో సాధారణంగా ఎడిటెడ్ వీడియోలకు రీచ్ ఎక్కువగా ఉంటుందంటారు. మీ వీడియోలు లేదా రీల్స్ తరచూ ఇతరులకు కన్పిస్తుండాలంటే రోజుకు ఒక వీడియో చొప్పున వారానికి కనీసం 5 తప్పకుండా పోస్ట్ చేస్తుండాలి. ఇన్‌స్టాలో ఇచ్చే ఎడిటింగ్ టూల్స్ సహాయంతో వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే ఇన్‌స్టా సర్టిఫైడ్ యూజర్ గుర్తింపు బ్లూ టిక్ ఇస్తుంది. ఒక వీడియోకు అత్యధికంగా లైక్స్ అండ్ షేర్స్ రావాలంటే ట్రెండింగులో ఉన్న మ్యూజిక్ ఇవ్వడం అవసరం. వీడియో రీచ్ పెరగాలంటే ఆర్గానిక్ పద్ధతిలోనే పెరగాల్సి ఉంటుంది. అప్పుడే ఆదాయం వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఇన్‌స్టాలో ఏదైనా బ్రాండ్ కొలాబొరేషన్ ఉండాలంటే 10 వేల ఫాలోవర్స్ అవసరం.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కొక్క పోస్ట్‌కు వచ్చే ఆదాయం ఐదు రకాలుగా ఉంటుంది. నానో, మైక్రో, మిడ్ టైర్, మాక్రో, మెగాగా ఉంటాయి. ఇందులో నానో అయితే 1000-10,000 ఫాలోవర్లు కలిగి ఉంటే 10-100 డాలర్లు లభిస్తాయి. మైక్రో విభాగంలో 10,000 నుంచి 50,000 ఫాలోవర్లు ఉంటే 100 నుంచి 500 డాలర్లు అందుతాయి. అదే మిడ్ టైర్ విభాగంలో 50 వేల నుంచి 5 లక్షలైతే ఒక్కొక్క పోస్ట్‌కు 500 నుంచి 5000 డాలర్లు లభిస్తాయి. ఇక మాక్రోలో 5 లక్షల నుంచి 10 లక్షల ఫాలోవర్లు ఉంటే పోస్ట్ ఒక్కొక్కటికి 5000 నుంచి 10 వేల డాలర్లు చెల్లిస్తారు. ఇక మెగా విభాగంలో 1 మిలియన్ పైన ఉన్న ఫాలోవర్లకు పోస్ట్ ఒక్కొక్కటికి 10 వేల నుంచి 1 మిలియన్ డాలర్లు చెల్లిస్తారు.
Also read: Redmi Smart tv: 4కే రిజల్యూషన్‌తో 42 వేల టీవీ ఇప్పుడు కేవలం 23 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Instagram Earning Tips: ఇన్‌స్టా నుంచి డబ్బులు సంపాదించడం ఎలా