Flipkart offers: దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే 5 జి స్మార్ట్‌ఫోన్ ఇదే, ధర, ఫీచర్లు ఇలా
Flipkart offers: దేశంలో 5జి నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక కావల్సింది 5 జి స్మార్ట్‌ఫోన్. మీ బడ్జెట్‌లో అందుబాటులో లేదని చింతించవద్దు. అత్యంత చౌకైన 5 జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మీ కోసం అందుబాటులోకి వచ్చేసింది
5జి నెట్ అందుబాటులో రావడంతో అందరూ ఇప్పుడు 5జి స్మార్ట్‌ఫోన్ కొనేందుకు సిద్ధమౌతున్నారు. కానీ ధర ఎక్కువగా ఉండటంతో వెనుకంజ వేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్‌లో నే 5జి స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది ఇన్‌ఫినిక్స్ కంపెనీ. ఆ వివరాలు మీ కోసం.
ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఇప్పుడు అత్యంత చౌక ధరలో 5జి స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టింది. ఇండియాలో ఇదే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న 5జి స్మార్ట్‌ఫోన్. ఇటీవలే లాంచ్ అయింది. నెమ్మది నెమ్మదిగా ఈ స్మార్ట్‌ఫోన్ డిమాండ్ పెరుగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ పేరు Infinix HOT 20 5G. భారతీయ మార్కెట్‌లో లభించే అత్యంత ఛౌక ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడీ ప్యానెల్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ పవర్ బటన్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర 17999 రూపాయలు. అయితే కంపెనీ ఈ ఫోన్ పై 38 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాదు..ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకుంటే 750 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధర 10 వేల కంటే తక్కువే అవుతుంది.
Infinix Hot 20 5G కెమేరా
ఇందులో 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ప్రత్యేకత. ఇందులో 4 జిబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. Infinix Hot 20 5G బ్యాటరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో టైప్ సి పోర్ట్‌తో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.
Also read: Adani-Hindenburg Row: అదానీ దిద్దుబాటు చర్యలు, స్వచ్ఛంధ ఆడిట్ కోసం జీటీ కంపెనీ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook