Flipkart Sales: ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ ఉత్సవ్ సేల్ 2024లో భాగంగా కొన్ని బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా రియల్ మి 11 5జిపై ఊహించని భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా 6 వేల రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. 108 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఫోన్ ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియల్ మి 11 5జి స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2400/1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 6100 ప్లస్ ఆక్టాకోర్ ప్రోసెసర్ ఉండటం విశేషం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ రెండు వేరియంట్లలో లభ్యమౌతోంది. ఇందులో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్‌తో పాటు 8జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వెర్షన్లు ఉన్నాయి. ఈ పోన్‌లో ప్రైమరీ కెమేరా 108 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 


ఇక ధరను పరిశీలిస్తే రియల్ మి 11 5జి స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర 18,999 రూపాయలు కాగా ప్రస్తుతం 13,299 రూపాయలకే లభిస్తోంది. ఏకంగా 6 వేల రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఇందులోనే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 13,999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ 6 వేల రూపాయల తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ ఉత్సవ్ సేల్‌లో ఇస్తున్న ఆఫర్. ఇది కాకుండా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. 


మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 8,150 రూపాయలు ప్రయోజనం పొందవచ్చు. ఇది కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనం కూడా ఉండనే ఉంది. ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ ఉత్సవ్ సేల్ 2024లో భాగంగా ఆర్బీఎల్, ఎస్ బ్యాంక్, బీవోబీ కార్డు, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 


Also read: Public Holiday: అక్టోబర్‌ 11న పబ్లిక్‌ హాలిడే.. బ్యాంకులకు సెలవు..! ఆర్‌బీఐ ప్రకటన..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.