Flipkart Sale: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే బిగ్ బిలియన్ డే సేల్ నిర్వహించింది. ఈ సేల్ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందించింది. ఇప్పుడు మరోసారి బిగ్ దసరా సేల్ ప్రారంభించింది. ఇందులో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రకారం చాలామంది ఐఫోన్ 13 బుక్ చేసుకున్నా డెలివరీ కాలేదు. ఆ తరువాత ఆర్డర్ రద్దయిపోయింది. ఇంకా చాలా రకాల ఫిర్యాదులు వచ్చాయి ఫ్లిప్‌కార్ట్‌పై. సేల్ సందర్బంగా ఐఫోన్ 13 ధరల్ని పెంచడం వల్ల ఆఫర్ ప్రయోజనం పెద్దగా లభించలేదనే ఫిర్యాదు కూడా ఉంది. 


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో ఐఫోన్ 13 కొనుగోలు చేయలేనివారికి మరోసారి అవకాశం వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ దసరా సేల్ ప్రారంభించింది. ఇందులో ఐఫోన్ 13 పై 14 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర ఇప్పుడు 59,990 రూపాయలైంది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీనిపై బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ అందుతుంది. అంటే మరో 3 వేల రూపాయలు తగ్గుతాయి. ఇది కాకుండా 16,900 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. 


ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్, పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై పూర్తిగా ఆఫర్ వర్తిస్తే ఐఫోన్ 13 కేవలం 40 వేలకే లభించనుంది. అయితే ఎక్స్చేంజ్ ధర ఆఫర్ పూర్తిగా వర్తించడమనేది దాదాపుగా అసాధ్యం. క్రోమా కూడా ఐఫోన్ 13పై మంచి ఆఫర్ ఇస్తోంది. ఇందులో ఈ ఫోన్ దాదాపు 53 వేలకు లభిస్తుంది. 


Also read: iPhone 14 Sales: దేశంలో ప్రారంభమైన ఐఫోన్ 14 విక్రయాలు, లాంచ్ ఆఫర్ డిస్కౌంట్లు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook