Gmail Alert: సెప్టెంబర్ 20 డెడ్‌లైన్, ఇలా చేయకుంటే మీ జీమెయిల్ ఎక్కౌంట్ డిలీట్
Gmail Alert: మెయిల్ ఎక్కౌంట్ అనేది ప్రస్తుత రోజుల్లో అత్యంత కీలకంగా మారింది. అందులో జీ మెయిల్ అత్యంత ప్రాచుర్యంలో ఉంది. మీక్కూడా జీమెయిల్ ఎక్కౌంట్ ఉండి ఇలా చేయకుంటే వెంటనే మీ ఎక్కౌంట్ డిలీట్ అవుతుంది జాగ్రత్త. ఈ అలర్ట్ జీ మెయిల్ నుంచి వచ్చిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gmail Alert: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ సేవల్ని 1.5 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరడంతో జీ మెయిల్ వాడకం మరింతగా పెరిగింది. విద్యార్ధుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు అందరూ తప్పనిసరిగా జీ మెయిల్ ఎక్కౌంట్ కలిగి ఉన్నవారే. అయితే ఇప్పుడు జీ మెయిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం చాలావరకు జీ మెయిల్ ఎక్కౌంట్లు డిలీట్ కానున్నాయి.
వాస్తవానికి జీ మెయిల్ వినియోగించేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. చాలామంది ఏదో ఒక అత్యవసర పని నిమిత్తం జీ మెయిల్ ఓపెన్ చేస్తుంటారు. స్కూల్స్, కాలేజీలు, ఇతర అవసరాల కోసం జీమెయిల్ క్రియేట్ చేస్తుంటారు. కానీ వాడకుండా వదిలేస్తుంటారు. దాంతో ఇలాంటి జీ మెయిల్స్ అన్నీ ఇనాక్టివ్‌గా ఉండిపోతుంటాయి. ఇలాంటి ఇనాక్టివ్ మెయిల్స్ కారణంగా గూగుల్ సర్వర్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇనాక్టివ్‌గా ఉన్న జీమెయిల్ ఎక్కౌంట్లను అంటే వాడుకలో లేనివాటిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
గత రెండేళ్లుగా వాడకంలో లేని జీ మెయిల్ ఎక్కౌంట్లను గూగుల్ డిలీట్ చేయనుంది. దీనికోసం సెప్టంబర్ 20 డెడ్‌లైన్ విధించింది. ఆ తేదీలోగా వాడకంలో లేని జీ మెయిల్ ఎక్కౌంట్లను యాక్టివ్ చేసుకోకుంటే ఆ తరువాత ఇక ఆ ఎక్కౌంట్లు మనుగడలో ఉండవు. డిలీట్ అయిపోతాయి. మీ జీ మెయిల్ ఎక్కౌంట్ ఏ స్థితిలో ఉందో చెక్ చేసుకోండి. గత రెండేళ్లుగా వాడకంలో లేకపోతే వెంటనే సెప్టెంబర్ 20 లోగా అంటే మరో మూడు రోజుల్లోగా యాక్టివ్ చేసుకోండి. లేకపోతే జీమెయిల్ ఖాతా కోల్పోవల్సి వస్తుంది.
జీమెయిల్ ఎక్కౌంట్ యాక్టివ్ చేయడం ఎలా How to acitvate inactive gmails
వాడకంలో లేని జీ మెయిల్ ఎక్కౌంట్లు యాక్టివ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. చాలా సులభంగా యాక్టివ్ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా సెప్టెంబర్ 20 తేదీలోగా ఆ ఎక్కౌంట్లు లాగిన్ చేసి వచ్చిన మెయిల్స్ చదవడం లేదా ఒకరిద్దరికి ఏదైనా మెయిల్ పంపించడం చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా మీ జీ మెయిల్ ఎక్కౌంట్ యాక్టివ్ అవుతుంది. మీ జీమెయిల్ ఎక్కౌంట్‌తో లింక్ అయి ఉన్న యూట్యూబ్ వీడియోను వీక్షించడం ద్వారా కూడా ఎక్కౌంట్ యాక్టివ్ చేయవచ్చు. ఏదైనా ఫోటో ఎవరికైనా పంపించవచ్చు. లేదా ఏదైనా డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయవచ్చు.
Also read: CBSE Scholorship 2024: సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయితే ఈ మెరిట్ స్కాలర్‌షిప్ మీ కోసమే. ఇలా అప్లై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.