ప్రముఖ స్మార్ట్‌ఫోన్లలో ఒకటైన గూగుల్ ఫోన్లకు చాలా ప్రత్యేకతలున్నాయి. గూగుల్ నుంచి కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. Google Pixel 7, Pixel 7 Pro ఫోన్ల ప్రీ బుకింగ్ ఇండియాలో ప్రారంభమైంది. అక్టోబర్ 6న అంటే రేపట్నించి ప్రీ బుకింగ్ ప్రారంభం కానుందని గూగుల్ స్పష్టం చేసింది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 7వ తేదీన గూగుల్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. గూగుల్ తొలి స్మార్ట్‌వాచ్ పిక్సెల్ వాచ్‌తో పాటు పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ల ప్రీ బుకింగ్ అక్టోబర్ 6వ తేదీ అంటే రేపట్నించి ప్రారంభం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉంది. అక్టోబర్ 6వ తేదీ రాత్రి 9.30 నుంచి ప్రీ బుకింగ్ ప్రారంభమౌతుంది.


గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర ఎంత


అమెజాన్‌లో పిక్సెల్ 7 లో 128 జీబీ స్టోరేజ్ మోడల్ 599 డాలర్లు ధర ఉండవచ్చు. గూగుల్ పిక్సెల్ 6 ధరకు సమానంగా ఉంది. గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర 699 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. 


గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో ప్రత్యేకతలు


గూగుల్ పిక్సెల్ 7లో ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.3 ఇంచెస్ ఫ్లాట్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. మరోవైపు పిక్సెల్ 7 ప్రోలో క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.7 ఇంచెస్ ప్యానల్ సపోర్ట్ ఉంది. రెండింట్లోనూ సెల్ఫీ కెమేరా కోసం ఫైవ్ హోల్ డిజైన్ ఉంటుంది. 


గూగుల్ పిక్సెల్ 7 లో డ్యూయల్ కెమేరా సిస్టమ్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. పిక్సెల్ 7 ప్రోలో ట్రిపుల్ కెమేరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, ఆప్టికల్ జూమ్, ఎల్డీఏఎఫ్ సపోర్ట్‌తో పాటు 48 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది టెన్సార్ జి2 చిప్‌సెట్‌తో నడుస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్ ఉంటుంది. 


ఈ రెండింట్లోనూ బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 తో నడుస్తాయి. మరోవైపు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 


Also read: SBI Share Price: పెరగనున్న ఎస్బీఐ షేర్ విలువ, ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook