COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Honor 90 Price in India: ప్రస్తుతం యువత ఫోటోగ్రఫీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ష్నాప్‌చాట్‌ పేరతో కలిగిన సోషల్‌ మీడియా యాప్‌లో స్ట్రీక్స్‌ షేర్‌ చేసుకోవడానికి అలవాటు పడ్డారు. అయితే కొన్ని టెక్‌ కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. అయితే ప్రముఖ టెక్‌ కంపెనీ హానర్ కూడా యువతను ఆకర్శించేందుకు త్వరలోనే 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ ఆధునిక ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రాబోతోందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ధర, లాంచింగ్‌ తేదీ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


Honor 90ను కంపెనీ త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతోందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విడుదల కంటే ముందే సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను మిడ్-ప్రీమియం విభాగంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ Honor 90, Honor 90 Pro మొబైల్స్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. విడుదైన స్మార్ట్‌ ఫోన్‌ వివరాల ప్రకారం..ఈ Honor 90 మొబైల్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేయబోతోంది. దీంతో పాటు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీలైనంత త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు రియల్‌మీ మాజీ సీఈఓ మాధవ్ షేత్ తెలిపారు. 


ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు


ధర వివరాలు:
ది మొబైల్ ఇండియన్‌ నివేదికల ప్రకారం..భారతదేశంలో హానర్ 90ని కంపెనీ  దాదాపు రూ. 35,000 ధరతో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే మార్కెట్‌లోకి విడుదలైతే OnePlus Nord 3 5G, iQoo Neo 7 Proతో పాటు Poco F5 5G వంటి మొబైల్స్‌పై పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. చైనాలో Honor 90 బేస్ 12GB+256GB వేరియంట్ CNY 2,499 (దాదాపు రూ. 29,000) ధరకు లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 16GB+256GB విషయానికొస్తే..CNY 2,799 (సుమారు రూ. 32,680) ధరకు లభిస్తోంది. భారత్‌లో వీటి ధర టాక్స్‌లతో పాటు కంపెనీ కొంత పెంచి విక్రయించే అవకాశాలు ఉన్నాయి.


ఫీచర్ల వివరాలు:
❀ 6.7 అంగుళాల పూర్తి-HD ప్లస్ కర్వ్డ్ OLED డిస్‌ప్లే
❀ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ 
❀ 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
❀ స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్‌
❀ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
❀ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 
❀ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా 
❀ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
❀ 6W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
❀ 5000mAh బ్యాటరీని ప్యాక్


ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి