Honor Magic 6 Series And Magic V2: అదిరిపోయే 3D కెమెరాతో మార్కెట్‌లోకి Honor Magic మొబైల్స్..పూర్తి వివరాలు ఇవే!
Honor Magic 6 Series And Magic V2: 3D డెప్త్ సెన్సార్ కెమెరాతో కూడిన Honor Magic 6, Honor Magic V2 సిరీస్‌లు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. ఇవే కాకుండా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honor Magic 6 Series And Magic V2: అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న హానర్ మ్యాజిక్ 6 సిరీస్ మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ప్రముఖ టెక్ కంపెనీ హానర్ ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 1వ తేదిన బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024 ఈవెంట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ Android 14 ఆధారంగా MagicOS 8.0తో లాంచ్ చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఈ మొబైల్స్ ఎంతో శక్తింవంతమైన Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రాసెసర్‌పై అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ ఈవెంట్లో భాగంగా కంపెనీ హానర్ మ్యాజిక్ V2 లైనప్‌ను వాటి ధరలను కూడా వెల్లడించిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హానర్ మ్యాజిక్ 6 స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Honor Magic 6 సిరీస్, Honor Magic V2 సిరీస్ పూర్తి వివరాలు:
ప్రముఖ టెక్ కంపెనీ హానర్ Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే లాంచ్ చేసింది. కంపెనీ 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫిబ్రవరి 25 నుంచి ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించగా..ప్రస్తుతం యూరప్‌లో కొన్ని ఈ కామర్స్ కంపెనీలతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే ఇది EUR 1,299 (భారత్‌లో సుమారు రూ. 1,16,600)తో లభిస్తోంది. దీంతో పాటు Honor Magic V2 RSR ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళ్తే, యూరప్‌లో EUR 2,699 (సుమారు రూ. 2,42,000)తో అందుబాటులో ఉంది. దీని విక్రయాలు మార్చి 18 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
హానర్ మ్యాజిక్ V2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MagicOS 7.2 ఇంటర్‌ఫేస్ రన్ కాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మొబైల్ ప్రీమియం Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఇది LTPO OLED డిస్‌ప్లేతో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యింది. అలాగే ఇది IP68 రేటింగ్‌తో డస్ట్‌తో పాటు వాటర్ రిసిస్టెంట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం ఇది చైనాలో అందుబాటులోకి వచ్చింది.
హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 ప్రో స్పెక్స్ వివరాలు:
హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 ప్రో డ్యూయల్ సిమ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0ని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్స్ ఎంతో శక్తివంతమైన 6.78 అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లేతో అందుబాటులో వచ్చాయి. దీంతో పాటు ఈ స్క్రీన్ 1,264 x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రాసెసర్‌తో లభిస్తోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ట్రిపుల్ రియర్ కెమెరా సెట్
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)
100x డిజిటల్ జూమ్
180 మెగాపిక్సెల్ 2.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా
50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
3D డెప్త్ సెన్సార్
5,600mAh బ్యాటరీ
50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter