Honor Play 60 Plus Price: ఒకప్పుడు ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ హానర్ (Honor) మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల అతిశక్తివంతమైన స్మార్ట్ ఫోన్స్ విడుదల చేయలేకపోయింది. ఇదిలా ఉండగా 2023 సంవత్సరంలో మరోసారి మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. దీంతో అప్పటినుంచి ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో మంచి మంచి మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా మార్కెట్‌లో ఉన్న తమ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ స్టోరేజ్‌తో పాటు శక్తివంతమైన బ్యాటరీలతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవలే హానర్ విడుదల చేసిన ప్లే 60 ప్లస్ (Honor Play 60 Plus) మొబైల్‌కు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం మీ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ హానర్ ప్లే 60 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా 6000mAh బ్యాటరీతో పాటు అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీని బ్యాక్‌ సెటప్‌లో 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 20GB ర్యామ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉండబోతోంది. దీంతో పాటు అతి శక్తివంతమైన 6.77 అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 


హానర్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు:
ఈ హానర్ ప్లే 60 ప్లస్ (Honor Play 60 Plus) మొబైల్‌ను కంపెనీ చైనాలో విడుదల చేసింది. ఈ మొబైల్‌ బేస్ వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే ఇది సుమారు రూ. 17,000 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ దీనిని మూడు కలర్‌ (ఫెయిరీ గ్రీన్, మ్యాజిక్ నైట్ బ్లాక్, మూన్ షాడో వైట్ కలర్) ఆప్షన్‌లో లాంచ్‌ చేసింది. అయితే కంపెనీ భారత్‌లో లాంచింగ్‌కి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.77 అంగుళాల TFT LCD డిస్‌ప్లే
850nits గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌
Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్
Adreno 613 GPU 
50MP డ్యూయల్ కెమెరా సెటప్‌
2MP సెకండరీ సెన్సార్ కెమెరా
LED ఫ్లాష్ యూనిట్ 
5MP ఫ్రంట్ కెమెరా
Android 14 
MagicOS 8.0 సాఫ్ట్‌వేర్ స్కిన్‌
6000mAh బ్యాటరీ
35W ఫాస్ట్ ఛార్జింగ్‌
SGS గోల్డ్ లేబుల్ డ్రాప్ రెసిస్టెన్స్ 
IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్స


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి