COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Huawei Nova 12I 5G Price: ఈ సంవత్సరంలో అద్భుతమైన కెమెరా సెట్ అప్‌తో కలిగిన మంచి మొబైల్‌ను బడ్జెట్లో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ముందుకు త్వరలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ హువావే (Huawei) సరికొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను Nova 12i 5G మోడల్‌లో తమ కస్టమర్స్‌కి అందించబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన ఫీచర్స్ తో అతి తక్కువ ధరలోనే లభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటగా ఈ మొబైల్ 8జిబి ర్యామ్ సెట్‌అప్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇతర వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.



లీకైన వివరాల ప్రకారం Huawei Nova 12i 5G స్మార్ట్ ఫోన్ అతి శక్తివంతమైన 5000 mAh పెద్ద బ్యాటరీ, 108 MP ప్రైమరీ కెమెరా సెటప్ తో అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 12 నుంచి 14 గంటల వరకు నాన్ స్టాప్‌గా వినియోగించవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ చార్జ్ చేయడానికి 40 వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల IPS LCD డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6080 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అలాగే కంపెనీ అద్భుతమైన స్టోరేజ్ ఆప్షన్ను పొందడానికి దీనిని 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది.


ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే, ఇది ఎంతో ప్రీమియం 108MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌కు ఉన్న ప్రధాన కెమెరాతో 1080Pలో వీడియోలను కూడా సులభంగా తీయవచ్చు. ఇక కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తోంది. నీకైనా వివరాల ప్రకారం లీకైన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే జూన్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ సంబంధించిన ధర విషయానికొస్తే, రూ. 24,990తో లభించబోతోందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన వెంటనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.


హువావే నోవా 12i 5G స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్:
డిస్ప్లే:

6.67" FHD+ డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్


పెర్ఫార్మెన్స్:
Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్
6GB/8GB RAM
128GB/256GB స్టోరేజ్
EMUI 12 ఆపరేటింగ్ సిస్టమ్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


కెమెరాలు:
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
50MP ప్రైమరీ కెమెరా
2MP మాక్రో కెమెరా
2MP డెప్త్ కెమెరా
8MP సెల్ఫీ కెమెరా


బ్యాటరీ:
4300mAh బ్యాటరీ
66W Huawei SuperCharge


ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
Wi-Fi 6
Bluetooth 5.1
NFC
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి