Huawei Nova Flip: చీప్ ధరలోనే మార్కెట్‌లోకి Huawei Nova Flip మొబైల్.. ఫీచర్స్ చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..
Huawei Nova Flip: ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్‌లోకి కొత్త ఫ్లిప్ మొబైల్ రాబోతోంది. ఇది Huawei Nova Flip పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Huawei Nova Flip: మార్కెట్లో ఫ్లిప్ మొబైల్స్‌కి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా సాంసంగ్ విడుదల చేసిన కొన్ని క్లిప్ మొబైల్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కొత్త కొత్త ఫ్లిప్ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Huawei ప్రీమియం ఫీచర్స్‌తో అతి త్వరలోనే గొప్ప ఫ్లిప్ మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ అతి తక్కువ ధరలోనే లాంచ్ చేసే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో మోడల్ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
Huawei విడుదల చేసే Nova Flip ఫ్లిప్ మొబైల్ అద్భుతమైన కెమెరా సెట్‌అప్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ లో భాగంగా దీనికి సంబంధించిన కెమెరా బ్యాటరీ ఇతర వివరాలు వెల్లడయ్యాయి. లీకైన వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం చిప్‌సెట్‌తో రాబోతోంది. ఇది Kirin 8000 చిప్‌సెట్‌పై నడుస్తుంది. అంతేకాకుండా ఆర్మ్ మాలి-జి610 జిపియును కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యేకమైన ఓఎస్ అప్డేట్ తో అందించబోతున్నట్లు సమాచారం అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ Huawei Nova Flip స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతోంది. ఇక ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 2690x1136 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ప్రధాన డిస్ప్లే 6.94 అంగుళాల LTPO OLEDతో రాబోతోంది. ఇక రెండవ 2.14 అంగుళాల కవర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇది 60Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. దీంతో 66W ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా అందిస్తోంది. దీని బ్యాక్ సెటప్‌లో LED ఫ్లాష్ కూడా ఉంటుంది. అయితే ఈ మొబైల్ కెమెరాలకు సంబంధించిన విషయానికి వస్తే, ఇది డబుల్ కెమెరా సెట్ అప్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో మరెన్నో కొత్త ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.