Huawei P70: సిగ్నాల్ లేకుండా ఫోన్ మాట్లాడొచ్చు! త్వరలోనే మార్కెట్‌లోకి Huawei P70 మొబైల్..
Huawei P70: అతి త్వరలోనే హువాయి (Huawei) నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో ఎంతో శక్తివంమైన కెమెరా సెటప్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Huawei P70: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ హువాయి (Huawei)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేయడంతో ఎప్పుడూ ముందుంటుంది. అయితే హువాయి త్వరలోనే తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలపబోతోంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన కెమెరాతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ హువాయి లాంచ్ చేయబోయే మొబైల్ ఏంటో? లీక్ అయిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే పలువురు టిప్‌స్టర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం, హువాయి (Huawei) కంపెనీ తమ అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను Huawei P70 మోడల్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన కెమెరాలు, బ్యాటరీలతో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని బ్యాక్ సెటప్‌లో అద్భుతమై బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు త్రిభుజాకార లేఅవుట్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ Huawei P70 స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో Sony IMX989 1-అంగుళాల సెన్సార్‌తో కూడిన అద్భుతమైన మ్యాజిక్ కెమెరాలో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ కెమెరాలో అనేక రకాల ప్రత్యేకమైన ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ మొబైల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సొల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సిగ్నల్ లేకున్న ఫోన్స్ మాట్లేడే ప్రత్యేకమైన టెక్నాలజీతో రాబోతోంది. దీంతో పాటు భూమిపై ఎక్కడి నుండైనా కమ్యూనికేట్ చేయడానికి ప్రత్యేకమైన శాటిలైట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
Huawei P70 స్మార్ట్‌ఫోన్ డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఇది 1.5K కర్వ్డ్ స్క్రీన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన డిస్ల్పేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ కిరిన్ 9000S 5G ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ మొబైల్ ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి విడుదలను కంపెనీ కాస్త ఆలస్యంగా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి