Hyundai Creta EV 2025 Pics: 2025లో విడుదలయ్యే Hyundai Creta EV మోడల్ చూశారా? ఫీచర్స్ పూర్తి వివరాలు లీక్..
Hyundai Creta EV 2025 On Road Price Details: అతి త్వరలోనే మార్కెట్‌లోకి Hyundai Creta EV కారు విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai Creta EV 2025 On Road Price: ప్రముఖ కొరియన్ కంపెనీ హ్యుందాయ్ మార్కెట్‌లోకి అద్భుతమైన కార్లను విడుదల చేస్తూ వస్తోంది. మార్కెట్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో విడుదల చేస్తూ వస్తోంది. భారత కస్టమర్స్ కూడా ఇలాంటి కార్లనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హ్యుందాయ్ కంపెనీ కొత్త EV కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హ్యుందాయ్ కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ కారును క్రెటా EV పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు ప్రీమియం డిజైన్‌తో విడుదల కానుంది. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ఈవెంట్‌లో భాగంగా ఈ క్రెటా EV కారును అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్రెటా EV కారుకు సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది గత మోడల్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హ్యుందాయ్ కంపెనీ ఈ కారుకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రెటా EV కారు మార్కెట్‌లోకి విడుదలైతే.. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న EV టాటా కార్లలో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ దీనిని కేవలం నలుపు రంగులోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ కారు ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ఫ్రంట్‌లో వెంటిలేటెడ్ సీట్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందిస్తోంది. వెనక భాగంలో ప్రత్యేకమైన సీట్లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ధర రూ.18 లక్షల ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హ్యుందాయ్ క్రెటా EV కారులో 360-డిగ్రీ రౌండ్ వ్యూ కెమెరాతో పాటు ప్రత్యేకమైన లెవెల్ 2 ADAS పంక్షన్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకమైన స్లాట్ ఆప్షన్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా యాపిల్, ఆండ్రాయిడ్ కార్ ప్లే ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.