Hyundai Verna Price: మధ్యతరగతి వారికి కారు కొనాలనే కోరిక ఉంటుంది. అయితే వారి దగ్గర తగినంత బడ్జెట్ ఉండదు. వారు ఏ మాత్రం నిరాశపడకుండా కొద్ది కొద్దిగా పోగు చేస్తూ తక్కువ ధరలో మంచి ఫీచర్ల ఉన్న కారును కొనుక్కోవాలని చూస్తారు. మీలాంటి సామాన్య, మధ్యతరగతి ప్రజల కలను నిజం చేస్తూ.. అదిరిపోయే ఫీచర్లుతో తక్కువ రేటుకే మాంచి లగ్జరీ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది ప్రముఖ ఆటో కంపెనీ హ్యుందాయ్. ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా కొత్త మోడల్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ కారు తెగ అమ్ముడుపోతుంది. దీని స్పెషిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీచర్స్
** 6 ఎయిర్‌బ్యాగ్‌లు
**ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
**ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)
**రివర్స్ పార్కింగ్ సెన్సార్
** ఆటో హెడ్‌ల్యాంప్
** ఐసోఫిక్స్
**టైమర్‌తో వెనుక డీఫాగర్
**ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్
**టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
** ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌
** డ్రైవర్ సీటు హైట్ సర్దుబాటు 


పవర్ పుల్ ఇంజిన్స్
హ్యుందాయ్ వెర్నాలో రెండు పవర్ పుల్ ఇంజిన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ నార్మల్ ఇంజిన్ 115 bhp పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160 బిహెచ్‌పి పవర్ మరియు 253 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మెుదటిది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తే.. రెండోది ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తోనే వర్క్ చేస్తుంది. కారు మైలేజీ లీటరుకు 20 నుండి 24 కిలోమీటర్లు వస్తుంది. 


ఇతర ఫీచర్లు
ఇంకా హ్యుందాయ్ వెర్నా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతోపాటు డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. కారులో ఎనిమిది-స్పీకర్ బాక్స్ సౌండ్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి.
ధర
హ్యుందాయ్ వెర్నా భారతదేశంలో 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర ₹10.96 లక్షలు, టాప్ వేరియంట్ ధర ₹17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్).


Also Read: MG Gloster vs Fortuner: ఫార్చ్యూనర్‌కు తలదన్నేలా ఎంట్రీ ఇవ్వనున్న ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ఇవే కొత్త ఫీచర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి