AI Chatboat in IRCTC: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కూడా ఈ పరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకుంటోంది. భారతీయ రైల్వే A1 చాట్‌బోట్ AskDisha 2.0 అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా రైల్వే సేవలు పొందవచ్చు. ఇందులో హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏఐ చాట్‌బోట్ ఐఆర్సీటీసీ మొూబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ఉంది.  AskDisha 2.0తో చిన్న చిన్న కమాండ్లు ఉపయోగించి రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఇంకా టికెట్ కేన్సిలేషన్ కూడా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్ ద్వారా టికెట్ బుకింగ్, కేన్సిలేషన్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, రిఫండ్ స్టేటస్ అన్నీ తెలుసుకోవచ్చు. దాంతోపాటు బోర్డింగ్ స్టేషన్ మార్పులు కూడా చేయవచ్చు. దీనికోసం ముందుగా చాట్‌బోట్ ఓపెన్ చేసి సంబంధిత వివరాల కమాండ్ ఎంటర్ చేయాలి. దీనికోసం మైక్రోఫోన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. 


AskDisha 2.0 సేవలు పొందాలంటే మీ మొబైల్‌లో IRCTC Rail Connect App డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు ఏ సేవలు పొందాలంటే ఆ సేవల్ని కమాండ్ ద్వారా ఎంటర్ చేసి పొందవచ్చు. ఈ సౌకర్యం మీ రైల్వే టికెట్ బుకింగ్ లేదా కేన్సిలేషన్ సేవలను మరింత సులభతరం చేస్తుంది. 


Also read: AP Voters list 2024: ఓటర్ల జాబితాలో మీ పేరుందా లేదా, ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook