Infinix Note 40 Pro 5G Leaked Features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Infinix త్వరలోనే మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనిని కంపెనీ Infinix Note 40 5G సిరీస్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. దీనిని కంపెనీ మార్చి 18న విడుదల చేయబోయే ఛాన్స్‌ ఉందని టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. ఈ సిరీస్‌ని కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 40, నోట్ 40 ప్రో 4G, నోట్ 40 ప్రో 5G పేర్లతో లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ధర వివరాలు లీక్‌ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించిన కొన్ని వివరాలను కంపెనీ ప్రెస్‌ నోట్‌ ద్వారా వెల్లడించింది. కానీ లాంచింగ్‌ వివరాలను మాత్రం కంపెనీ ఇంకా పేర్కొనలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ కూడా సోషల్ మీడియాతో పాటు YouTubeలో ప్రత్యేక్షమవుతోంది. దీని బ్యాక్‌ సెటప్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరాలతో పాటు AI యాక్టివ్ హాలో లైటింగ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్స్‌ లాంచ్‌ కాబోతున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌గా భావించవచ్చు.


AI యాక్టివ్ హాలో లైటింగ్ ఫీచర్‌:
మొట్టమొదటి సారిగా AI లైటింగ్‌తో లాంచ్‌ అవుతున్న Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్స్‌ ఇన్‌కమింగ్ కాల్‌ సమయంలో వీటి పనితీరును గమనించవచ్చు. అంతేకాకుండా ఇవి నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్, ఛార్జింగ్, గేమింగ్ సమయంలో యాక్టివ్‌గా ఉంటాయి. దీంతో పాటు  "హాయ్ ఫోలాక్స్" వాయిస్ అసిస్టెంట్‌ను వాడే క్రమంలో కూడా ఇవి వెలుగుతాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ అధికారింగా ప్రకటించలేదు. కానీ లీక్‌ అయిన వివరాల ప్రకారం..ఇవి MediaTek Helio G91 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు అతి శక్తివంతమైన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. నోట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మాత్రం డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌తో రాబోతున్నాయి. ఇక ఈ సిరీస్‌లు 8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 14 సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్నాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్స్‌ టాప్‌ 10 ఫీచర్స్‌:
6.7 అంగుళాల FHD+ ట్రూ కలర్ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్‌తో స్పష్టమైన డిస్‌ప్లే
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
16MP సెల్ఫీ కెమెరా
30fps  AI బ్యూటిఫికేషన్, 1080p వీడియో రికార్డింగ్‌ సపోర్ట్‌
MediaTek Helio G91 ప్రాసెసర్
8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ చార్జింగ్
ఆండ్రాయిడ్ 14
డ్యూయల్ స్పీకర్లు
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి