Infinix Smart 8 Plus: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇటీవల ఇన్ఫినిక్స్ క్రేజ్ పెరుగుతోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా ధర అందుబాటులో ఉండటం ప్రధాన కారణం. అదే క్రమంలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మార్కెట్‌లో వస్తోంది. ఇక టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి36 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో IMG Power VR GE 8320 GPU గ్రాఫిక్ కార్డు ఉండటంతో  గేమింగ్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది.18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ డిజైన్ పరంగా చూస్తే మ్యాజిక్ రింగ్ బెజెల్‌తో ఫ్లూయిడ్ పంచ్ హోల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 


ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. దాంతోపాటు 4 జీబీ వర్చువల్ ర్యామ్, 2 టీబీ మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, ఆర్టిఫిషియల్ లెన్స్‌తో క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ సపోర్ట్ డ్యూయల్ రేర్ కెమేరా ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ పేస్ ఫాస్ట్ అన్‌లాకింగ్ ఫీచర్ ఉంది. 


ఇన్ని ఫీచర్లు కలిగిన Infinix Smart 8 Plus ధర ఎక్కువగా ఉంటుందని అనుకోవద్దు. చాలా తక్కువ. అసలు ధర 7,799 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 500 రూపాయలు తగ్గుతుంది. దాంతో ఈ ఫోన్ 7299 రూపాయలకే అందనుంది. 


Also read: IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook