Tips To Reduce Current Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ప్రతినెల కరెంట్ బిల్ కొంతమందికి 100 నుంచి 150 వస్తుంది కానీ మరి కొందరికి ఏకంగా  వేళల్లోస్తోంది. చాలా మంది దీని కారణం ఇంట్లో ఉండే  ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కరెంట్ వినియోగం పెరుగుతుంది భావిస్తారు. అయితే వీటితో పాటు మనం చేసే కొన్ని పొరపాట్లు వల్ల కూడా కరెంట్‌ బిల్ల పెరుగుతుందని మీకు తెలుసా? ఇంతకీ మనం చేసే పొరపాట్లు ఏంటి? కరెంట్‌ను ఎలా పొదుపు చేయాలి? అనే విషయాలు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టిప్స్‌ పాటిస్తే మీ కరెంట్ బిల్ కూడా 100 నుంచి 150 రాదు. ముందుగా మీరు తెలుసుకొనే టిప్ సెల్ ఫోన్ చార్జింగ్.. నేటికాలంలో ప్రతిఒక్కరి ఇంట్లో సెల్‌ ఫోన్‌ ఉంటుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది సెల్ ఫోన్ చార్జింగ్ చేస్తుంటారు. ఒక సర్వే ప్రకారం  సంవత్సరానికి 10 శాతం బిల్లు సెల్ఫోన్ వల్లే వస్తోందని తేలింది. దీని కంట్రోల్‌ చేయడం ఎంతో సులభం. ఇంట్లో ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ చేయాల్సి ఉంటుంది.  చార్జింగ్‌ అయిన తరువాత స్విచ్ ఆఫ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్లగ్‌ తీసేయండి. ఇలా చేయడం వల్ల కరెంట్‌ అనేది ఎక్కువగా ఖర్చు కాదు. 


ప్రతి ఇంట్లో లైట్లు ఉంటాయి. నార్మల్ సిక్స్టీ క్యాండిల్ బల్బుల వల్ల చాలానే కరెంట్ బిల్ వస్తుంది. వీటికి బదులుగా మీరు ఎల్ఈడి బల్బులు అమర్చండి దీని వల్ల 50% వెయిట్ నుంచి వచ్చే బిల్లు తగ్గించవచ్చు.  ఇవి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికి ఒక్కసారి తీసుకుంటే మూడు నుంచి ఐదు ఏళ్ళు మళ్ళీ మార్చే పని ఉండదు. అలాగే లైట్లు ఉపయోగించిన తరువాత ఆఫ్‌ చేయడం మంచిది. దీని వల్ల అనవసరంగా కరెంట్‌ వేస్ట్‌ కాదు. 



ఇప్పుడు ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్‌లు సర్వసాధారణం అయిపోయాయి. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు చేయడం, హోంవర్క్ చేయడం, గేమ్స్ ఆడడం లాంటివి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. కానీ చాలా మంది పని అయిపోయిన తర్వాత ఆఫ్‌ చేయడం మర్చిపోతారు. కొంతమంది ఎక్కువ సేపు వాటిని చార్జింగ్‌ చేస్తుంటారు. దీని వల్ల కరెంట్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంట్లో అవసరం లేకుండా ల్యాప్‌టాప్‌లు చార్జింగ్‌ చేస్తే కంట్రోల్‌ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతినెలా రెండు వందల రూపాయలు తగ్గించవచ్చు . ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది.


ప్రతిఇంట్లో హెవీ కరెంట్‌ కన్జ్యూమింగ్ ఐటమ్స్ఉంటాయి. హెవీ కరెంట్ కన్జ్యూవింగ్ ఐటమ్స్ అంటే ఐరన్ బాక్స్, గీజర్, ఓవెన్ , వాషింగ్ మిషన్, వాటర్ మోటర్‌. ఇవి కరెంట్‌ బిల్లును ఎక్కువగా పెంచుతాయి. కానీ వీటిని కంట్రోల్‌ చేయడం ఎంతో సులభం. ఐరన్ బాక్స్ తీసుకోండి ఆన్ చేసి హీట్ అవ్వడానికి ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ పక్కన ఉంచుతాం. అలా రోజు ఒక టూ మినిట్స్ వేసుకున్న చాలా కరెంట్ అనేది కాలుతుంది అలా కాకుండా ఒకేసారి ఎక్కువ బట్టలు ఐరన్ చేసుకుంటే చాలా కరెంట్ సేవ్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఏ ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌ కొనుగోలు చేసిన మీరు ఎల్లప్పుడు 5 స్టార్‌ రేటింగ్‌ ఉండే వాటిని తీసుకోవడం మంచిది. ఇవి ఖరీదైనప్పటికి కరెంట్‌ ను బాగా సేవ్ చేస్తాయి.


Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.