Buy iPhone 12 just Rs 33999 in Flipkart: 'ఐఫోన్ 12' ఇప్పటివరకు భారతదేశంలో ప్రసిద్ధ యాపిల్ ఐఫోన్ మోడల్‌గా ఉంది. ఎందుకంటే ఐఫోన్ 12లో అద్భుత ఫీచర్లు ఉండడమే. అయితే ఈ మోడల్ ధరలు చాలా ఎక్కువుగా ఉండడంతో సామాన్య ప్రజలు కొనలేకపోయారు. ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 మోడల్ కొనుగోలుపై వినియోగదారులకు భారీ తగ్గింపు లభిస్తోంది. వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. ఆ తగ్గింపు ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 12 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 12 అసలు ధర రూ. 64900లుగా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో 12% తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 12 వినియోగదారులకు రూ. 56,999కి అందుబాటులో ఉంటుంది. అయితే డిస్కౌంట్ ప్రక్రియ ఇక్కడితో ముగిసిపోలేదు. కస్టమర్లకు మరో భారీ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ అమలు చేస్తే మీరు ఐఫోన్ 12 మోడల్‌పై వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. 


ఐఫోన్ 12 మోడల్‌పై కస్టమర్‌లకు రూ. 23000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇవ్వబడుతుంది. ఈ ఎక్స్‌ఛేంజ బోనస్ పూర్తిగా వర్తిస్తే.. రూ. 56999 ఉన్న ఐఫోన్ 12 రూ. 33999లకు మీకు లభిస్తుంది. మొత్తంగా రూ. 64900లుగా ఉన్న ఐఫోన్ 12.. కేవలం రూ. 33999లకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అంటే అసలు ధరలో దాదాపు సగం అని చెప్పొచ్చు. ఈ ఆఫర్ చూసి జనాలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంది. 


Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్ట్.. చెతేశ్వర్ పుజారా ముందు అరుదైన మైలురాయి!   


Aslo Read: Rare Rajyog 2023: అరుదైన రాజయోగం.. 30 ఏళ్ల తర్వాత మారునున్న ఈ రాశుల వారి జీవితం! పది రెట్లు ఆకస్మిక లాభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.