iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమేరాతో iQoo Z9S Pro రేపు ఆగస్టు 21న ఇండియాలో లాంచ్ కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో విక్రయాలు జరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iQoo Z9S Pro స్మార్ట్‌ఫోన్ 6.77 ఇంచెస్ 3 డి కర్వ్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో స్క్రీన్ క్వాలిటీ అద్భుతంగా ఉండనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీటెక్కకుండా ఉండేందుకు వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. 


iQoo Z9S Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతుంటాయి. ఇక ఐపీ 64 రేటింగ్ కావడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వస్తోంది. 


iQoo Z9S Pro కెమేరా వివరాలు పరిశీలిస్తే ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమేరా, 4కే రిజల్యూషన్ వీడియోతో 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. అంతేకాకుండా 2ఎక్స్ డిజిటల్ జూమ్, పోర్ట్రెయిట్, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ ధర 25 వేలు ఉండవచ్చని అంచనా. 


Also read: Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook