Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకే
Iqoo Z9X 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న బ్రాండ్ ఐక్యూ. ఇప్పుడు భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది. అమెజాన్‌లో విక్రయాలు జరగనున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.
Iqoo Z9X 5G 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటంతో అద్భుతమైన క్లారిటీ కన్పిస్తుంది. ఇక ప్రోసెసర్ అయితే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 తో పనిచేస్తుంది. ర్యామ్ కూడా చాలా ఎక్కువ. ఏకంగా 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక IP64 రేటింగ్ కలిగి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో ఉంటుంది. స్టీరియో స్పీకర్లు ఉండటంతో అద్భుతమైన మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. కనెక్టివిటీ అయితే బ్లూటూత్ 5.1 , వైఫై 5 సపోర్ట్ చేస్తుంది.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా స్మార్ట్‌పోన్ల కంటే Iqoo Z9X 5G బ్యాటరీ సామర్ధ్యం చాలా ఎక్కువ. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ మూడు వేరియంట్లలో లభించనుంది.
Iqoo Z9X 5G కెమేరా పరంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి ఉంటాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Iqoo Z9X 5G ప్రారంభ ధర 15 వేలు ఉండవచ్చని అంచనా. కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
Also read: Amazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook