iQOO Z9 Turbo: త్వరలోనే 1 TB స్టోరేజ్‌తో iQOO Z9 Turbo మొబైల్ రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్!
iQOO Z9 Turbo: ఐక్యూ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z9 Turbo పేరుతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
iQOO Z9 Turbo Leaked: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మొబైల్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఐక్యూ త్వరలోనే Z సిరీస్‌లో కొత్త మొబైల్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది iQOO Z9 Turbo పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. అయితే iQOO కంపెనీ లాంచ్ తేదిని కూడా ప్రకటించడంతో అంచనాలు పెరిగాయి. ఈ మొబైల్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే Redmi Turbo 3 మొబైల్‌తో పాటు Realme GT Neo 6తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. ఐక్యూ కంపెనీ Z9 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి Z9, Z9x సిరీస్‌లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ Z9 Turbo స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఐక్యూ Z9 Turbo స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌లో గేమింగ్ కోసం ప్రత్యేకమైన గ్రాఫిక్స్ టిప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది ఎంతో ప్రీమియం 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 6K VC హీట్ డిస్సిపేషన్ యూనిట్‌తో రాబోతోంది. దీని డిస్‌ప్లే 6.78 అంగుళాలతో కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఫ్లాట్ OLEDతో పాటు 1.5K రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది.
ఈ డిస్ల్పే 144Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 2160PWM డిమ్మింగ్ ఫీచర్స్‌తో పాటు ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో మార్కెట్‌లోకి రానుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 12 GB, 16 GB ర్యామ్ ఆప్షన్స్‌తో పాటు 1 TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో LED ఫ్లాష్‌తో పాటు డబుల్ కెమెరా సిస్టమ్‌తో రాబోతోంది.
డబుల్ కెమెరా సెటప్‌లో భాగంగా ఇందులో ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 8-మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత Origin OS 4పై పని చేస్తుంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదట చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి