itel A70 Price Cut: శక్తివంతమైన itel A70 మొబైల్‌ను రూ.349కే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్!
itel A70 Price Cut: అతి తక్కువ ధరలోనే 128GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో itel A70 స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
itel A70 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో త్వరలోనే ప్రైమ్ డే సేల్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ సేల్‌కి సంబంధించిన తేదిలను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనిని అమెజాన్ జూలై 20 తేది నుంచి 21 వరకు జరపబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ముఖ్యంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌పై ప్రైమ్ సేల్‌కి ముందే డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ సేల్‌కి ముందు ఏయే స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే itel కంపెనీ లాంచ్ చేసిన A70 సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై ప్రైమ్ డేస్ సేల్‌కి ముందే భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 8 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా మూడు స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ప్రస్తుతం 4Gb ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ MRP రూ.9,999తో లభిస్తోంది. దీనిని ప్రైమ్ డేస్ సేల్‌కి ముందే కొనుగోలు చేసేవారికి 32 శాతం వరకు తగ్గింపుతో రూ.6,799కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా అన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిల్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లపై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లపై కూడా నో కాస్ట్ EMI ఆప్షన్ లభిస్తోంది. ఈ EMI ఆప్షన్‌ను వినియోగించాలనుకునేవారు నెలకు రూ.306 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.6,450 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది స్మార్ట్‌ఫోన్ కండీషన్ బట్టి అధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్చేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.349కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి