Lava 02 Price Cut: భారత స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లో అంతగా గుర్తింపు లేకపోయినా మన మార్కెట్లో మాత్రం కాస్త మంచి పేరే ఉంది. దీనిని ఇలానే కంటిన్యూ చేసేందుకు కొన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు అత్యధిక ఫీచర్లతో తక్కువ ధరల్లోనే మంచి మొబైల్స్ ను విక్రయిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవలే కొన్ని కంపెనీలు లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్ మంచి ప్రజాదరణ పొందాయి. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు ఉండడంతో ఎక్కువగా యువతను అట్రాక్ట్ చేయగలిగాయి. ఎప్పటినుంచో మీరు కూడా అతి తక్కువ ధరలోని మంచి టీచర్స్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటే, ఇది సరైన సమయం గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో కొన్ని భారత టెక్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన ఓ మొబైల్ పై ఏకంగా భారీ డిస్కౌంట్ తో అందిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే లాంచ్ అయిన లావా 02 స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపు ధరలలో లభిస్తోంది. ఈ మొబైల్ పై స్లాట్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్, బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే కంపెనీ దీనిని కేవలం ఒక స్టోరేజ్ ఆప్షన్‌తో మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ.9,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో కొనుగోలు చేసే వారికి 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ మొబైల్ కేవలం రూ. 7,999కే పొందవచ్చు. 


ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించి ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే వారికి అదనంగా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అలాగే కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్ చూజ్ చేసుకునే వారికి నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి అద్భుతమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ పై లభిస్తున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


లావా O2 టాప్ ఫీచర్లు:
6.5 అంగుళాల HD+ IPS డిస్ప్లే
 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్
MediaTek Helio G35 చిప్‌సెట్
T616 Octacore ప్రాసెసర్ 
డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ కెమెరా
8MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Android 11 ఆపరేటింగ్ సిస్టమ్
డ్యూయల్ 4G VoLTE
Wi-Fi 802.11 b/g/n
Bluetooth 5.0
GPS, USB Type-C కనెక్టివిటీ
డ్యూయల్ సిమ్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
 FM రేడియో


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి