Lava plans to launch 5G Smartphone Lava Agni 2 5G @ india very Soon: భారతీయ మొబైల్ మార్కెట్‌లో 'లావా' సంస్థకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియాకు చెందిన లావా ఎప్పటినుంచో కొత్తకొత్త మొబైల్స్ తీసుకొస్తూ వినియోగదారులను తనవైపు తిప్పుకుంతోంది. ఈ క్రమంలోనే గొప్ప ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతుంది. ఆ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 2 5G (Lava Agni 2 5G). త్వరలోనే ఈ ఫోన్ రిలీజ్ కానుందట. లావా  తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను (Lava Agni 5G) నవంబర్ 2021లో విడుదల చేసింది. దీని సక్సెస్ వర్షనే లావా అగ్ని 2 5G. మరో స్మార్ట్‌ఫోన్‌ (Blaze 1X 5G)ను కూడా లావా విడుదల చేయనుందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lava Agni 2 5G Specifications:
పలు నివేదికల ప్రకారం లావా కంపెనీ మేలో లావా అగ్ని 2 5G ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. లీక్‌ల ప్రకారం అగ్ని 2  ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.5-అంగుళాల AMOLED ప్యానెల్‌తో వస్తుంది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని గీక్‌బెంచ్ వెల్లడించింది. 8 GB RAM మరియు Android 13 OSపై లావా అగ్ని 2 5G  రన్ అవుతుంది.


Lava Agni 2 Price In India:
లావా అగ్ని 2 5G ఫోన్‌ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చుని సమాచారం. 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావచ్చు. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. అగ్ని 2 5G ధర భారతదేశంలో రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఉండవచ్చని అంచనా.


Lava Blaze 1x 5G Launch:
ఒక ట్వీట్‌లో వినియోగదారు ప్రకటించని బ్లేజ్ 1x 5G పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Blaze 5G అత్యంత సరసమైన 5G ఫోన్‌లలో ఒకటిగా ఉంటుందట. అయితే ఈ ఫోన్ ధర, ఫీచర్ల వంటి వివరాలు ఏమీ చెప్పబడలేదు. ఇది లావా నుంచి వచ్చే మరొక సరసమైన 5G ఫోన్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: Samsung Galaxy S22 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎస్22పై భారీ డిస్కౌంట్.. కొనడానికి ఎగబడుతున్న జనాలు! 22 వేలు సేఫ్  


Also Read: Tata Punch Sales 2023: కారు చిన్నదే అయినా జనాలు టాటా పంచ్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.. టాప్ 5 రీజన్స్ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.