COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lava Blaze X 5G Price: ఎంతో ప్రాముఖ్యత పొందిన భారతీయ టెక్‌ బ్రాండ్‌లలో Lava ఒకటి. గతంలో ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉండేది. పోను పోను భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరగడంతో ఈ కంపెనీ మొబైల్స్‌ వాడకాలు చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. అయితే కంపెనీ గత సంవత్సరం నుంచి ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తూ వస్తోంది. దీంతో ఈ కంపెనీ మొబైల్స్‌ విక్రయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే దీనిని ఇలా కంటిన్యూస్‌ చేసేందుకు కంపెనీ మరో ముందడుగు వేసింది. లావా కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.


భారతదేశంలో Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను జూలై 10న లాంచ్‌ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో భాగంగా ఈ మొబైల్‌ మొదటి సేల్‌ను ప్రారంభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది  USB టైప్ C పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి ఫీచర్స్‌ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్‌ ఉండబోతున్నాయి. 


లావా బ్లేజ్ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ డబుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ను లాంచ్‌ చేసింది. టీజర్‌లో ఉన్న వివరాల ప్రకారం, ఈ మొబైల్‌ వెనక భాగంలో 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ నార్జ్‌ AMOLED ప్యానెల్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో అద్భుతమైన LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఈ Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.  ఇది 4GB ర్యామ్‌, 6GB ర్యామ్‌తో పాటు 8GB ర్యామ్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB వర్చువల్ ర్యామ్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లావా బ్రాండింగ్‌తో పాటు రెండు కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతోంది. ఇవే కాకుండా ఇది అద్భుతమైన డిజైన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరెన్నో కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి