COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lava Yuva 5G First Sale: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లావా కంపెనీ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ జూన్‌ 5వ తేదిన ప్రారంభించింది. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇది దేశంలో అత్యధిక చౌక ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌ 64GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ మొబైల్‌ను మొదట ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఎంతో అద్భుతమైన 50MP AI కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మొదటి సేల్ ఆఫర్స్‌:
లావా కంపెనీ ఈ Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.9,499 కాగా రెండవ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.9,999తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది మిస్టిక్ బ్లూతో పాటు మిస్టిక్ గ్రీన్ కలర్‌ ఆప్షన్స్‌లో లభించబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అమెజాన్‌ ప్రత్యేకమైన తగ్గింపును కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంచబోతోంది. 


Lava Yuva 5G ఫీచర్స్‌ పూర్తి వివరాలు:
ఈ Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన UNISOC T750 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఇది 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్‌ సెటప్‌తో లభిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా మరెన్నో ప్రీమియం ఫీచర్స్‌ కూడా ఈ మొబైల్‌లో అందుబాటలోకి వచ్చింది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా
2MP కెమెరా సెన్సార్ కెమెరా
8MP కెమెరా సెన్సార్‌ కెమెరా
పోర్ట్రెయిట్
స్లో మోషన్
టైమ్‌లాప్స్
ఆడియో నోట్
మోషన్ ఫోటో
అల్ట్రా-రిజల్యూషన్
బ్యూటీ
హెచ్‌డిఆర్
AI, ప్రో, పనోరమా కెమెరా ఫీచర్స్‌


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి