Mivi Fort S80 Soundbar Price: మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌లకి మార్కెట్‌లో రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పరికరాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఎలక్ట్రిక్‌ స్వదేశి కంపెనీలు నూతన ఫీచర్స్‌తో సౌండ్‌బార్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. కానీ వీటి ధరల కారణంగా సాధరణ కస్టమర్స్‌ కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే ప్రముఖ ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ Mivi దీనిని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలోనే సౌండ్‌బార్‌లను విడుదల చేసింది. ఈ సౌండ్‌బార్‌లు అతి తక్కువ ధరలతో ఎక్కువ ఫీచర్స్‌ను కలిగి ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సౌండ్‌బార్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mivi Fort S80 Soundbar:
Mivi విడుదల చేసిన సౌండ్‌బార్‌లు Mivi Fort S80, Mivi Fort S120 పేర్లతో లభిస్తున్నాయి. S80 మోడల్ కలిగిన సౌండ్‌బార్ 80W సౌండ్‌ అవుటుపుట్‌ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్‌బార్‌లు చూడడానికి సబ్‌వూఫర్స్‌లాగా కనిపిస్తాయి. Mivi Fort S80 Soundbar 2 విషయానికొస్తే.. 2 సబ్‌ వూఫర్‌లతో 80 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు ఈ సౌండ్‌బార్‌ 2.2 ఛానల్ సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇక ఈ సౌండ్‌బార్‌ డిజైన్‌ విషయానికొస్తే..ఫ్రంట్ ప్యానెల్ ప్రీమియం మెటాలిక్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. ఈ బార్‌  USB, బ్లూటూత్ 5.0, కోక్స్‌తో పాటు ఆక్స్ నెక్టివిటీలని కలిగి ఉంటుంది.


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  
   
Mivi Fort S120 Soundbar:
Mivi Fort S120 సౌండ్‌బార్ 2 సబ్‌ వూఫర్‌లతో 120 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ అదిస్తుంది. ఇందులో S80 మోడల్‌లో కలిగి ఉన్న సరౌండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇక నెక్టివిటీ ఫీచర్స్‌ విషయానికొస్తే..బ్లూటూత్, USB, Coax, AUX, HDMI వంటి ఐదు కనెక్టివిటీలను కంపెనీ అందిస్తోంది. దీంతో పాటు EQ మోడ్‌లతో రిమోట్ కంట్రోల్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ బార్‌ను కంపెనీ గ్రే కలర్‌లో విడుదల చేసింది. 


ధర, ఇతర వివరాలు:
కంపెనీ Mivi Fort S80 Soundbarను ధర రూ. 3,999లో విడుదల కస్టమర్స్‌కు అందించబోతోంది. ఇక Mivi Fort S120 బార్‌ రూ. 5,499ల కంటే తక్కువ ధరలోనే లభించబోతోంది. రెండు సౌండ్‌బార్‌లు 3 సెప్టెంబర్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందబాటులోకి రాబోతున్నాయి. అయితే విడుదల సందర్భంగా ఈ రెండు బార్లపై దాదాపు రూ. 1000 వరకు తగ్గింపును అందిచే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook