Cheapest Smartwatch: అద్భుతమైన ఫీచర్లతో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్.. కేవలం 1299 రూపాయలకే
Cheapest Smartwatch: ఇయర్‌బడ్స్ విభాగంలో సంచలనం రేపిన మివి..ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. అద్బుతమైన ఫీచర్లే కాకుండా..అత్యంత చౌక ధరకు లాచ్ చేసింది ఈ స్మార్ట్‌వాచ్‌ను.
Cheapest Smartwatch in India: మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ Mivi ఇండియాలో తొలి స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. ఇప్పటికే ఇయర్‌బడ్స్ విభాగంలో మార్కెట్‌లో హల్‌చల్ చేసిన Mivi ఇప్పుడు స్మార్ట్‌వాచ్ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ విభాగంలో Mivi హల్‌చల్ చేస్తోంది. ట్రూలీ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్ రేంజ్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 5 విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు ఉండటమే కాకుండా..అత్యంత చౌక ధరకు లాంచ్ అయింది. కేవలం 1299 రూపాయలకే ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది.
Mivi స్మార్ట్‌వాచ్ ఫీచర్లు, ప్రత్యేకతలు
ఈ స్మార్ట్‌వాచ్ 1.69 ఇంచెస్ డిస్‌ప్లేతో ఉంది.హెచ్‌డి ఫాంట్ టచ్ స్క్రీన్‌తో వస్తోంది. ఈ వాచ్‌లో యూజర్లకు బ్లూటూత్ 5.1 సౌకర్యముంది. బ్యాటరీ విషయంలో 200 ఎంఏహెచ్ లిథియం పాలీమర్ యూనిట్ ఉంటుంది.
ఇందులో యూజర్లకు ప్రీ ఇన్‌స్టాల్ వర్కవుట్ మోడ్ లభిస్తుంది. ఇందులో సైక్లింగ్, జాగింగ్, హైకింగ్, వాకింగ్, యోగాతో పాటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ 1.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే..5-7 నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇందులో 2- రోజుల స్టాండ్‌బై లభిస్తుంది. ఈ వాచ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. నీళ్లలో పడినా..బాగా పనిచేస్తుంది. ప్రత్యేకించి వాటర్ స్పోర్ట్స్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో కస్టమర్లకు సిలికాన్ స్ట్రాప్‌తో పాటు స్టెయిన్‌లెస్ డయల్ లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. వాచ్‌లో యూజర్ల కోసం చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు ఉన్నా..కేవలం 1299 రూపాయలకే లభించడం విశేషం.
Also read: 32 Inches Smart TV: స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్.. రూ.7 వేలకు లోపే 32 ఇంచుల టీవీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook