Moto G04s Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ మోటో తమ కస్టమర్స్‌కి గుడ్‌న్యూస్‌ తెలిపింది. త్వరలోనే Moto G04s స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌ వివరాలు, ధర, వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మే 30న భారతదేశంలో లాంచ్‌ కాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌, కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ దీనిని గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకు రాబోతోంది. ఇది గత ఫిబ్రవరి నెలలో లాంచ్‌ చేసిన  Moto G04 స్మార్ట్‌ఫోన్‌కి అప్డేట్‌ వేరియంట్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ Moto G04s స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మైక్రోసైట్‌ కూడా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక్ష ప్రసారం అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి తీసుకువచ్చి, ఆ తర్వాత ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ మొబైల్‌ జూన్‌ మొదటి వారంలో తమ కస్టమర్స్‌కి లభించే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై మొదటి సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ ఆఫర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ Moto G04s స్మార్ట్‌ఫోన్‌ గతంలో లాంచ్‌ అయిన Moto G04 మొబైల్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా లాంచ్‌ అవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో 16-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ డిస్ల్పే ప్రోటక్షన్‌ కోసం.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ సెటప్‌ను అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరను కూడా టిప్‌స్టర్‌ వెల్లడించారు. ఈ మొబైల్ వేరియంట్‌ల వారిగా ధరలు చూస్తే, 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్ ధర రూ.6,999 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ వేరియంట్ ధర రూ.7,499 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


Moto G04s ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Android 14పై రన్‌ అవుతుంది. 
Dolby Atmos సౌండ్ సపోర్ట్‌
Unisoc T606 చిప్‌సెట్‌
6.6-అంగుళాల డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
5000mAh బ్యాటరీ
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
50-మెగాపిక్సెల్ AI కెమెరా
22 గంటల టాక్ టైమ్
20 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్
102 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి