COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moto G31 2024 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటరోలా తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేయనుంది. ఇది అద్భుతమైన డిజైన్‌ కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Moto G31 పేరుతో మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఇది రూ.12 వేలలోపే అందుబాటులో ఉంది. అయితే అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారు.. కొన్ని రోజుల పాటు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తర్వాత ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీలతో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ Moto G31 స్మార్ట్‌ఫోన్‌ త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో పాటు అద్భుతమైన బ్యాక్‌ ఫినిషింగ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్‌ 6.47-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇది పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా దీని డిస్ల్పే ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


Moto G31 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌:
ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Helio G85 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. ఇది రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటి వేరియంట్‌ 4Gb ర్యామ్‌ + 64Gb ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రెండవ వేరియంట్‌  6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రాబోతోంది. అలాగే హైబ్రిడ్‌ మెమరీ కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 11పై పని చేస్తుంది. దీంతో పాటు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో రాబోతోంది. 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 


Moto G31 కెమెరా సెటప్:
ఈ Moto G31 స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. దీని ప్రధాన కెమెరా 50 MP ఉండగా, 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2 MP అదనపు కెమెరా సెటప్‌లతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 13 MP సెల్పీ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా 1080p పూర్తి HD వీడియో రికార్డింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక దీని బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 20W వరకు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ ధర రూ.11,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్‌ రూ.12,999 నుంచి రాబోతోంది.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.