Motorola Edge 40 Neo Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో మెగా జూన్‌ బొనాంజా సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ చీఫ్‌ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా Motorola కంపెనీకి సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై అదనంగా భారీ బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌  జూన్ బొనాంజా సేల్‌లో బంఫర్‌ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ప్రస్తుతం 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ కలిగిన ఈ Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌  ధర రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్‌ 12GB ర్యామ్‌ మోడల్‌ ధర రూ.25,999తో లభిస్తోంది. అయితే ఈ రెండు మోడల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1000 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు మొదటి వేరియంట్‌ ధర రూ. 22,999కే లభిస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. 


ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.3,000 వరకు ఎక్చేంజ్‌ కూడా లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ. 19,999కే పొందవచ్చు. 


ఫీచర్స్‌ స్పెషిఫికేషన్స్‌ వివరాలు:
మీడియాటెక్ డైమెన్షన్ 7030 ప్రాసెసర్‌
IP68 వాటర్‌ప్రూఫ్
6.55 అంగుళాల POLED డిస్‌ప్లే
HD ప్లస్ రిజల్యూషన్ 
144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌
HDR10+ సపోర్ట్
రెండు OS అప్‌గ్రేడ్‌లు
మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
Android 14
డ్యూయల్ కెమెరా సెటప్
OISతో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా
ఆటోఫోకస్‌తో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా
32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా
68W ఫాస్ట్ ఛార్జింగ్‌
5000 mAh బ్యాటరీ


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి