COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola Edge 40 Neo Price: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ మోటరోలా గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే మోటరోలా నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. మోటరోలా Edge 40 Neo సిరీస్‌తో విడుదల చేయబోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కంపెనీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదిన ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌ వివరాలను టిప్‌స్టర్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారు.  Motorola Edge 40 Neoను కంపెనీ మిడ్-రేంజ్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక ఈ మొబైల్‌ ఫోన్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే..Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా MediaTek Dimensity 7030 ప్రాసెసర్‌పై ఈ మొబైల్‌ పనిచేస్తుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ ధర:
టిప్‌స్టర్‌ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ విడుదలైతే..ధర రూ.24,999గా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ విడుదలైన తర్వాత Poco X5 Pro, Samsung Galaxy M53 5G, Realme 10 Pro Plusతో పోటీ పడే ఛాన్స్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక రెండవ వేరియంట్‌ ధర రూ.26,000లోపే ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. 


Motorola Edge 40 Neo సెప్టెంబర్ 21న ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో లభించబోతోంది. ఇప్పటికే ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఈ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్‌లను పేర్కొన్నారు. ఈ మొబైల్‌ను యూరప్‌ దేశాల్లో ఇప్పటికే విడుదల చేశారు.  Motorola Edge 40 Neo 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ EUR 399 (దాదాపు రూ. 35,400)లతో లభిస్తోంది. 



Motorola Edge 40 Neo ఫీచర్లు:
6.55 అంగుళాల పూర్తి HD ప్లస్ 
poLED కర్వ్డ్ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్‌లు
144 Hz రిఫ్రెష్ రేట్‌
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌
 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
13-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్
5000mAh బ్యాటరీ
68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
Android 13
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook