COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola Edge 40 Neo Vs Vivo T2 Pro 5G: ప్రస్తుతం చాలా మంది యువత తక్కువ ధరలో లభించే ప్రీమియం బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. టెక్‌ కంపెనీలు కూడా మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే మోటోరోలా, వివో లాంచ్‌ చేసిన కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అయితే కస్టమర్స్‌ కూడా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీల్లో వీటి విక్రయాలే జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మోటోరోలా ఎడ్జ్ 40 నియో, వివో T2 ప్రో 5G రెండు స్మార్ట్‌ఫోన్స్‌ పోటపోటీగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో బెస్టో ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్ల పరంగా చూస్తే..మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల OLED డిస్ల్పేతో 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇది  Snapdragon 695 5G ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇక వివో T2 ప్రో 5G మొబైల్‌ వివరాల్లోకి వెళితే, 6.67 అంగుళాల AMOLED డిస్ల్పేతో పాటు 120Hz రిఫ్రెష్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌  MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇక ప్రాసెసర్‌ పరంగా వివో T2 ప్రో 5G మొబైల్‌ మంచి పని తీరును కలిగి ఉంటుంది. 


ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన స్టోరేజ్‌, ర్యామ్‌ వివరాల్లోకి వెళితే..మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. మొదటి ఆప్షన్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక రెండవది 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌తో అందుబాటులోకి ఉంది. ఇక వివో T2 ప్రో 5G మాత్రం కేవలం ఒకే స్టోరేజ్‌ (8GB RAM, 128GB) వేరియంట్‌లో లభిస్తోంది.  ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ధరల విషయానికొస్తే..ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి రెండు రూ.21,999 ధరలతో అందుబాటులో ఉన్నాయి. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చాయి. మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అదనంగా 13MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP డెప్త్‌ సెన్సార్ కెమెరాలో లభిస్తోంది. ఇక వివో T2 ప్రో 5G మొబైల్‌ 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మోటోరోలా 4020mAh, 30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ మధ్య కేవలం చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ప్రాసెసర్‌ పరంగా మోటోరోలా ఎడ్జ్ 40 నియో బెస్ట్ అని చెప్పొచ్చు. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter