COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola Edge 50 Ultra Price: మోటరోలా తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలే మోటరోలా లాంచ్‌ చేసిన Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్‌కి మంచి రెస్పాన్స్‌ రావడంతో దీనికి అప్డేట్‌ వేరియంట్‌లో కొత్త మొబైల్‌ విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ప్రీమియం ఫీచర్స్‌తోనే అతి తక్కువ ధరలో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (Motorola Edge 50 Ultra)ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు సంబంధించిన విడుదల తేదిని కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించిన్నట్లు తెలుస్తోంది. దీనిని ఏప్రిల్ 16న గ్లోబల్‌ లాంచ్‌ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. అయితే ఈ మొబైల్‌ విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్‌ను ప్రముఖ టిప్‌స్టర్‌ డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ లీక్‌ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లీక్‌ అయిన వివరాలేంటో వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.     


లీక్‌ అయిన వివరాల ప్రకారం..ఈ కొత్త మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ శక్తివంతమైన Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 125W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వ్డ్ ఎడ్జ్‌ డిస్ప్లేతో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. దీని డిస్ల్పే సెంటర్ పంచ్-హోల్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇందులోని 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌తో రాబోతోంది. 


ఈ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (Motorola Edge 50 Ultra) మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో ఉండే మెయిన్‌ కెమెరా 75mm టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 3.2x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే ఈ మొబైల్‌ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 12 GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌ సింగిల్-కోర్ పరీక్షలో 1947 పాయింట్లు సాధించిన్నట్లు సమాచారం. ఇక ఈ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 4500mAh బ్యాటరీ, 125 వాట్ వైర్డ్‌, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా టాప్ 10 ఫీచర్లు:
స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌
4nm ప్రాసెస్‌ నిర్మాణం
6.7 అంగుళాల pOLED డిస్ప్లే
144Hz రిఫ్రెష్ రేట్‌
12MP అల్ట్రా-వైడ్ సెన్సార్
30x హైబ్రిడ్ జూమ్‌
4500mAh బ్యాటరీ
125W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
5G కనెక్టివిటీ
రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఫేస్ రికగ్నిషన్‌ సపోర్ట్‌


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి