COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola G04s Price: ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో ఫ్లాన్‌ చేసుకున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటో సంబంధించిన మొబైల్స్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తున్నాయి. వీటిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 20 నుంచి 30 శాతం వరకు ఫ్లాట్‌ తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటోకు సంబంధించిన ఏ మొబైల్‌ అతి తక్కువ ధరతో లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
    
ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో Motorola G04s ఒకటి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. మోటో కంపెనీ మే 30న ఈ మొబైల్‌ను లాంచ్‌ చేసింది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకమైన సేల్‌ను‌ ప్రారంభించింది. ఈ మొబైల్‌కు సంబంధించిన మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభించబోతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.6,999 నుంచి ప్రారంభమవుతుంది. 


ఇక ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆప్షన్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారు రూ. 247 నెలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మొబైల్‌ కంపెనీ త్వరలోనే బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ను ప్రకటించబోతోంది. అంతేకాకుండా త్వరలోనే ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూతో పాటు సన్‌రైజ్ ఆరెంజ్‌ కలర్స్‌లో లాంచ్‌ కాబోతోంది. 


ఇక Motorola G04s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, దీని డిస్ల్పే 90Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే కంపెనీ ఈ మొబైల్‌ను  6.56 అంగుళాల HD+ LCD ప్యానెల్‌తో కూడిన డిప్లేతో తీసుకువచ్చింది. దీంతో పాటు ఇది 1612x720 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌:


50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
LED ఫ్లాష్‌
8 జీబీ ర్యామ్‌
64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌
5000mAh బ్యాటరీ
15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
USB టైప్-సి పోర్ట్
 Wi-Fi, GPS
బ్లూటూత్ 5.0
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి