Moto Foldable Phone: అత్యంత శక్తివంతమైన, అత్యంత స్టైలిష్ ఫోల్డెడ్ ఫోన్ ఇప్పుడు మోటో నుంచి వస్తోంది. Moto Razr 50 Ultra పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు, డిజైన్ వంటివి లీక్ అయ్యాయి. డిజైన్ మాత్రం అత్యంత స్టైలిష్‌గా ఉండటంతో ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇదొక క్లామ్ షెల్ ఫోల్డబుల్ ఫోన్. డ్యూయల్ కెమేరా సెటప్ కలిగి ఉంటుంది. ఇంకా ఇతర ఫీచర్లు ఏమున్నాయో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటో స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కారణం ఫీచర్లు అద్భుతంగా ఉండటం, బ్యాటరీ సామర్ధ్యం ఎక్కువ, ధర తక్కువగా ఉండటం. ఇప్పుడు త్వరలో 
Moto Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇందులో సెకండరీ స్క్రీన్ పంచ్ హోల్ డిజైన్ కలిగి అద్భుతంగా కొత్త లుక్‌తో కన్పిస్తుంది. గత ఏడాది మోటో నుంచి లాంచ్ అయిన Razr 40 Ultra తరహాలోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్‌లో కెమేరాలు అమర్చి ఉంటాయి. ఈ ఫోన్ ఏకంగా 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం ప్రత్యేకత. గత ఏడాది లాంచ్ అయిన Motorola Razr 40 Ultra 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర 89, 999 రూపాయలు. 


గత ఏడాది లాంచ్ చేసిన Razr 40 Ultra ఫోన్ 6.9 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ పోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లేతో 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో ఫోన్ స్క్రీన్ సైజ్ 3.6 అంగుళాలుంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ కెమేరా సెటప్ ఉండి సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే 3800 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంటుంది. మోటోరోలా లాంచ్ చేయనున్న Razr 50 Ultraలో గొరిల్లా కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. మొత్తానికి మోటో లాంచ్ చేస్తున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలియకపోయినా లుక్ మాత్రం అద్భుతంగా స్టైలిష్‌గా ఉంది.  


Also read: Form 16 Info: ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడొస్తుంది, ఐటీ రిటర్న్స్‌లో ఎందుకు అవసరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook