Form 16 Info: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగి ఎవరైనా సరే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఫామ్ 16 తప్పనిసరి. ఆ వ్యక్తి ఉద్యోగం చేసే సంస్థ జారీ చేస్తుంది. ఫామ్ 16 ఉంటేనే ఐటీ రిటర్న్స్ సులభంగా ఫైల్ చేయవచ్చు. లేకపోతే ఇబ్బందులు ఎదురౌతాయి. ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సరైందా కాదా అనేది పరిశీలిద్దాం. అసలు ఫామ్ 16 ఎప్పుడు జారీ అవుతుందో చూద్దాం.
ప్రతి ఉద్యోగికి ఫామ్ 16 అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఫామ్ 16 కోసం నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం 2023-24 ఆర్ధిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం ఇది. జూలై 31 వరకూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు సమయముంది. మీ ఆదాయం జీతం ద్వారా వస్తుంటే మాత్రం ఫామ్ 16 కోసం ఆగాల్సిందే. మరి అంత కీలకమైన ఫామ్ 16 ఎప్పుడొస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం. మీరు ఉద్యోగం చేసే సంస్థలు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఆఖరు తేదీ మే 30. మే నెలాఖరులోగా టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయగలిగితేనే మీకు జూన్ 15 నాటికి ఫామ్ 16 ఇవ్వగలరు. అంటే ఉద్యోగులకు ఫామ్ 16 చేతికి అందేది జూన్ 15 తరువాతే.
ఫామ్ 16 లేకపోయినా ఇన్‌కంటాక్స్ ఫైల్ చేయవచ్చు. ఎందుకంటే ప్రతి ఉద్యోగికి పే స్లిప్, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలుంటాయి. వీటి సహాయంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా వివరాలు మిస్ మ్యాచ్ అయితే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఫేక్ ఫామ్ 16 ఉంటుందా
మీ సంస్థ నుంచి ఫామ్ 16 అందుకోగానే ఓసారి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది. Traces వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం జారీ చేసే ఫామ్ 17 పొందవచ్చు. ఇందులో ట్రేసెస్ లోగో, మీ పేరు, పాన్ నెంబర్ వివరాలుంటాయి. ఫామ్ 26ఏఎస్‌తో సరిచూసుకోవాలి. టీడీఎస్ ఎంత కట్ అయిందనే వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. లేకపోతే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
Also read: IT Returns Benefits: మీ ఆదాయం ట్యాక్స్ పరిధిలో లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook