Nokia G42 Price Cut: ఇప్పుడు Nokia G42 మొబైల్‌ను మరింత చీప్ ధరకు పొందండి.. పూర్తి వివరాలు ఇవే!
Nokia G42 Smartphone Get Cheaper: నోకియా తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో Nokia G42 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్ ఇప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ఎంత తగ్గింపును అందిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Nokia G42 Smartphone Get Cheaper: నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD గ్లోబల్ గత సంవత్సరం మార్కెట్‌లో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రావడం వల్ల చాలా ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే దీనిని గుర్తించి కంపెనీ నోకియా G42 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన 65 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసింది. అందుకే ఈ మొబైల్ మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 20W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కలిగి ఉంటుంది. దీనిని ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Nokia G42 ధర, డిస్కౌంట్ వివరాలు:
గత సంవత్సరం నవంబర్ నెలలో కంపెనీ Nokia G42 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది 6GB RAM వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.12,599తో కంపెనీ లాంచ్ చేసింది. అయితే కంపెనీ మార్కెట్‌లో తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ధర రూ.900 డిస్కౌంట్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను నోకియా G42ని రూ.11,699కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ సో పింక్, సో గ్రే, సో పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Nokia G42 స్పెసిఫికేషన్‌లు:
Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 720x1612 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రాబోతోంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రోటక్షన్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అలాగే ఇది 6GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తోంది. ఇది 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లను అందిస్తోంది.
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
50MP ప్రైమరీ కెమెరా
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో లెన్స్ కెమెరా
8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5000mAh బ్యాటరీ
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి