Nokia HMD brand Upcoming Smartphones: ప్రముఖ టెక్‌ కంపెనీ నోకియా సబ్ బ్రాండ్‌ HMD మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. సాధరణ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి 9 స్మార్ట్‌ ఫోన్స్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మొబైల్‌ లాంచ్‌కి సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లీక్‌ అయిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం IMEI డేటాబేస్‌లో తొమ్మిది కొత్త HMD స్మార్ట్‌ ఫోన్స్‌ను పేర్కొన్నట్లు సమాచారం. మొదట కంపెనీ రెండు స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేసి ఆ తర్వాత మరో ఏడు మొబైల్స్‌ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ HMD బ్రాండ్‌ మొత్తం 11 కొత్త స్మార్ట్ ఫోన్స్‌పై పని చేస్తోందని సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 HMD స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే:
ప్రముఖ టెక్‌ కంపెనీ నోకియా ఇటీవలే తమ బ్రాండ్‌ను HMDగా మార్చుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఇక నుంచి నోకియా ఇదే బ్రాండ్‌ను నుంచి స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ HMD బ్రాండ్‌కి సంబంధించి 9 స్మార్ట్ ఫోన్స్‌ IMEI డేటాబేస్ జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ తొమ్మిది మొబైల్స్‌ మోడల్స్‌ వివరాలు..


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


మొదటి మోడల్ TA-1584
రెండవ మోడల్‌ TA-1588
మూడవ మోడల్‌ TA-1589
నాలుగవ మోడల్‌ TA-1592
ఐదవ మోడల్ TA-1594
ఆరవ మోడల్‌ TA-1595
ఏడవ మోడల్‌ TA-1602
ఎనిమిదవ మోడల్ TA-1605
తొమ్మిదవ మోడల్‌ TA-1631


ఈ తొమ్మది స్మార్ట్ ఫోన్న్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ మంచి ప్రజాదరణ పొందేందుకు ప్రీమియం లుక్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొబైల్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ విషయానికొస్తే..OISతో 108MP ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటాయని పలువు టెక్‌ టిప్‌స్టర్స్‌ తెలిపారు. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter