Nokia Hmd Skyline: 32MP ఫ్రంట్ కెమెరాతో నోకియా HMD నుంచి మొబైల్.. ఫీచర్స్‌తో మదిని దోచేస్తోంది!
Nokia Hmd Skyline: త్వరలోనే మార్కెట్‌లోకి నోకియా సబ్ బ్రాండ్ హెచ్‌ఎమ్‌డి కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Nokia Hmd Skyline Lunch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నోకియా సబ్ బ్రాండ్ హెచ్‌ఎండీ గ్లోబల్ తమ కస్టమర్స్‌కి త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. అద్భుతమైన ప్రీమియం డిజైన్‌తో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ గతంలో లాంచ్ చేసిన నోకియా లూమియా 920 డిజైన్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీ కంపెనీ ఈ మొబైల్ గురించి అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కానీ ఇటీవలే బెల్జియన్ రిటైలర్ వెబ్‌సైట్‌లో ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. ఈ మొబైల్ HMD స్కైలైన్ (HMD Skyline) అనే పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్‌ఎమ్‌డి పూర్తి వివరాలు:
ఇటీవలే బెల్జియన్ రిటైలర్ వెబ్‌సైట్‌లో లీక్ అయిన ఫోటోల ప్రకారం, ఈ HMD స్కైలైన్ (HMD Skyline) స్మార్ట్‌ఫోన్ డిజైన్ నోకియా లూమియా మొబైల్ లాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని అంచులు ఎంతో పదునుగా, చూడడానికి ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. దీని డిజైన్ ఓ బాక్సు షేప్‌లా కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే, దీని కెమెరా రౌండ్‌గా మాడ్యూల్‌లో రానుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్కిన్ కలర్ చాలా కర్శనీయంగా కనిపిస్తుంది.
HMD స్కైలైన్ ఫీచర్స్:
ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే, త్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే వెనక భాగంలోనే ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉండబోతోంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌ను ముందుగా పింక్ కలర్ వేరియంట్‌లో విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టిప్‌స్టర్ సుధాన్షు తెలిపిన వివరాల ప్రకారం, ఇది బ్యాక్ వేరియంట్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వెనక భాగంలోనే HMD అనే ప్రత్యేకమైన లోగోను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ HMD స్కైలైన్ (HMD Skyline) స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఇందులో ఎన్నో ప్రీమియం ఫీచర్స్‌ను అందించబోతోంది. ఇక ఈ మొబైల్ HD+ OLED డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన బాడీతో అందుబాటులోకి తీసుకు రానున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ స్మార్ట్‌ఫోన్ అదనంగా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు వీడియో కాలింగ్ కోసం, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇక ఈ మొబైల్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన 4900mA బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు IP67 రేటింగ్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరను కంపెనీ వెల్లడించలేదు. అతి తొందరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి