COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia Latest Phones 2024: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ HMD (నోకియా) మూడు కొత్త Nokia ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కంపెనీ ఈ మూడు మొబైల్స్‌ను అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇవి Nokia 215 4G, Nokia 225 4Gతో పాటు Nokia 235 4G మోడల్స్‌లో విడుదలయ్యాయి. నోకియా కంపెనీ ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్‌ను  యునిసోక్ T107 ప్రాసెసర్‌తో  అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్స్‌ S30+ OSతో అందుబాటులో వచ్చాయి. అలాగే మూడు ఫోన్‌లలో క్లౌడ్ యాప్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు వార్తలను చూసేందుకు, వెదర్‌ ఆప్డేట్స్‌ కోసం ప్రత్యేకమైన వెడ్జెస్‌ కూడా లభిస్తున్నాయి. 


మోడల్స్‌, ధర వివరాలు:
ఐర్లాండ్ దేశంలో HMD అధికారిక వెబ్‌సైట్‌లో Nokia 235 4G మొబైల్‌ దాదాపు ధర రూ. 5,800తో లభిస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్స్‌ను మూడు (బ్లాక్, బ్లూతో పాటు పర్పుల్) కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఇతర మోడల్‌ నోకియా 225 4G ఫోన్‌ పింక్, డార్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అంతేకాకుండా నోకియా 215 4G స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, డార్క్ బ్లూతో పాటు పీచ్ షేడ్స్‌లో విడుదలైంది. ఈ  మొబైల్స్‌ ప్రత్యేకమైన డిజైన్‌తో లభిస్తున్నాయి. 


నోకియా కంపెనీ Nokia 225 4G, Nokia 215 4G ధరలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే త్వరలోనే వీటి ధరకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూడు స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇవి Unisoc T107 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు  S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ మొబైల్స్‌ 64MB ర్యామ్‌తో పాటు 128MB ఇంబిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


దీంతో పాటు ఈ మూడు మొబైల్స్‌లో మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని 32 GB వరకు పెంచుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అలాగే 1450mAh బ్యాటరీతో సెటప్‌తో లభిస్తున్నాయి. దీంతో పాటు ఇది గరిష్టంగా 9.8 గంటల బ్యాటరీ సామర్థాన్ని కలిగి ఉంటాయి. ఛార్జింగ్ కోసం ఈ ఫోన్స్‌లో కంపెనీ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్స్‌కి సంబంధించిన స్క్రీన్స్‌ వివరాల్లోకి వెళితే, ఇవి 2.8-అంగుళాల QVGA LCD డిప్లేతో రాబోతోంది. దీంతో పాటు మూడు మొబైల్స్‌లో టాప్‌ వేరియంట్స్‌లో 0.3 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీలను కలిగి ఉంటాయి. ఇవే కాకుండా ఇతర అనేక ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి