Nokia Magic Max: నోకియా కనెక్టింగ్ పీపుల్ అంటే మొబైల్ ఫోన్ వచ్చిన ప్రారంభం నుంచి చాలాకాలం మార్కెట్‌ను శాసించిన బ్రాండ్. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో వచ్చాక కాస్త ప్రాభవం తగ్గినా ఇటీవల మరోసారి మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అద్భుతమైన కెమేరాతో 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోకియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. నోకియా మేజిక్ మ్యాక్స్ పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమేరా, 12 జిబి ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో పాటు 5జి సౌకర్యం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబి ర్యామ్‌తో మూడు రేర్ కెమేరాల సెటప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ అయితే ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌కు లేనంతగా 7500 ఎంఏహెచ్ ఉండటం విశేషం. ఇక కెమేరా గురించి పరిశీలిస్తే సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం అత్యధికంగా 64 మెగాపిక్సెల్ ఉంది. రేరే కెమేరా సెటప్‌లో 200 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ ఉండటం విశేషం. 


నోకియా మేజిక్ మ్యాక్స్‌లో 6.7 ఇంచెస్ ఎమ్యులేట్ స్క్రీన్ ఉంటుంది. గ్లాస్ సురక్షితంగా ఉంచేందుకు గొరిల్లా గ్లాస్ వినియోగించింది కంపెనీల. ఇక 120 హెచ్‌డి రిఫ్రెష్ రేట్‌తో పాటు 1080 × 2400 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 


నోకియా మేజిక్ మ్యాక్స్‌లో 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ 2 ఆక్టా కోర్ ప్రోసెసర్ ఉంటుంది. బ్యాటరీ అయితే ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లో లేని విధంగా 7500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం గమనార్హం. 


నోకియా మేజిక్ మ్యాక్స్ ధర ఎంత


నోకియా మేజిక్ మ్యాక్స్ ధర గురించి ఇంకా అధికారికంగా ప్రకటన జారీ కాలేదు. కానీ 32,990 రూపాయల్నించి 49,999 రూపాయల మధ్యలో ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలో మార్కెట్లో అందుబాటులో రానుంది. 


Also read: A 350 Flights: దేశంలోని తొలి ఎయిర్ బస్ ఏ 350 జనవరి 22 నుంచి ప్రారంభం, బుకింగ్స్ ప్రారంభం, ఏయే మార్గాల్లో, ఎన్నిగంటలకు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook