Nokia G42: నోకియా ఫోన్. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు గానీ సెల్‌ఫోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న వారికి సుపరిచితమైన బ్రాండ్. అప్పట్లో నోకియా తప్ప మరే ఇతర కంపెనీ పెద్దగా లేదనే చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వచ్చాక మరుగునపడిన నోకియా ఇప్పుడు మరోసారి హల్‌చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోకియా పేరు చెప్పగానే కనెక్టింగ్ పీపుల్ అనే మాట గుర్తొస్తుంది. అప్పట్లో అంతగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్ ఇది. ఇప్పుడు మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. నోకియా జి42 కొత్త 5జీ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ఎస్ఓసితో, ఆండ్రాయిడ్ 13పై నడుస్తుంది. 5జి స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయిన నోకియా జి42 ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం..


నోకియా జి42 ఫీచర్లు


నోకియా జి42 నేది 6.56 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ పొంది ఉంటుంది. 450 నిట్స్ బ్రైట్ నెస్, కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్, డ్యూరెబిలిటీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ఎస్ఓసితో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది. 


నోకియా జి 42 కెమేరా, బ్యాటరీ వివరాలు


అన్నింటికీ మించి నోకియా దజి42లో త్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరా ఉంటాయి. అద్భుతమైన ఫోటోలు, క్వాలిటీ వీడియోలు తీసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. ఇక బ్యాటరీ విషయంలో సందేహం అవసరం లేదు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 


నోకియా జి 42 ధర కూడా అందుబాటులో ఉన్న ధరే కావడం విశేషం. ఇండియాలో నోకియా జి42 ధర 12, 599 రూపాయలకు లభిస్తోంది. ఇందులో పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.


Also read: Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook